టీమిండియా వన్డే క్రికెట్ కెప్టెన్సీ మార్పు తర్వాత మొదటిసారి ప్రస్తుత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) , మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పబ్లిక్‌గా కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరే ముందు న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు ఎదురుపడ్డారు. గిల్, రోహిత్‌ను చూసి హర్షంగా పలకరించగా, రోహిత్ కూడా చిరునవ్వుతో స్పందిస్తూ “అరె గిల్… ఎట్లున్నావ్ బ్రదర్?” అంటూ హాస్యభరితంగా ఆత్మీయంగా పలకరించాడు. ఆ క్షణం అక్కడ ఉన్న ఇతర ఆటగాళ్లను, అభిమానులను ఆకట్టుకుంది.
Read Also: Virat Kohli: ఆర్‌సీబీ కి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పనున్నాడా?
ఈ వీడియోను ప్రస్తుతం టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. “ఇదే నిజమైన టీమ్ స్పిరిట్”, “ఇదే కెప్టెన్, మాజీ కెప్టెన్‌ల బంధం”, “క్యూటెస్ట్ వీడియో” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, గౌరవం స్పష్టంగా కనిపిస్తోంది.
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) ఇద్దరూ ఒకరినొకరు గౌరవంగా చూసుకోవడం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది.మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం టీమిండియా బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కింది. భారత ఆటగాళ్లంతా ఢిల్లీ విమానాశ్రయంలోనే కలుసుకున్నారు. ముందుగా వన్డే సిరీస్ జరగనుండగా.. అక్టోబర్ 19న పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.
టీమిండియా వెటరన్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా జట్టుతో కలిసి ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కారు. ఈ సిరీస్‌లో టీమిండియాను శుభ్‌మన్ గిల్ నడిపించనుండగా..కోహ్లీ, రోహిత్‌లు అతని సారథ్యంలో ఆడనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: