📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Gavaskar: వరల్డ్ కప్ లో గిల్ కు దక్కని చోటు.. గవాస్కర్ ఏమన్నారంటే?

Author Icon By Aanusha
Updated: December 20, 2025 • 7:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జీత్ సైకియా శనివారం మధ్యాహ్నం టీ20 ప్రపంచకప్ 2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఈ సెలక్షన్లో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది.ఈ సెలెక్షన్ లో అందరినీ షాక్‌కు గురిచేసిన విషయం శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తొలగింపు. గత కొన్ని సిరీస్‌లుగా టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న గిల్‌ను ఈసారి ప్రపంచకప్ జట్టు నుంచి పూర్తిగా తప్పించారు.

Read Also: T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే!

Gill did not get a place in the World Cup squad… What did Gavaskar say about it?

గిల్‌ను తప్పించడం నన్ను ఆశ్చర్యపరిచింది

టీ20 ఫార్మాట్‌లో అతను వరుసగా ఫెయిల్ అవుతుండటం, నెమ్మదిగా ఆడటం వల్లే సెలెక్టర్లు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. వైస్ కెప్టెన్ హోదాలో ఉండి కూడా జట్టులో చోటు కోల్పోవడం గిల్‌కు పెద్ద ఎదురుదెబ్బ.ఈ విషయంపై గవాస్కర్ (Gavaskar) మాట్లాడుతూ.. “గిల్‌ను తప్పించడం నన్ను ఆశ్చర్యపరిచింది. అతను నాణ్యమైన ఆటగాడు.

ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం. అయితే సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగడంతో అతను లయ అందుకోలేకపోయాడు. టీ20 ఫార్మాట్‌లో దూకుడుగా ఆడాలి. గిల్ సహజ శైలి టెస్ట్ క్రికెట్‌కు సరిగ్గా సరిపోతుంది. కానీ ఐపీఎల్‌లో తనేంటో నిరూపించుకున్నాడు. బహుశా ఫామ్ లేకపోవడమే అతడి ఎంపికపై ప్రభావం చూపింది” అని గవాస్కర్ (Gavaskar) విశ్లేషించాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

latest news Shubman Gill Sunil Gavaskar T20 cricket analysis Team India Selection Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.