ఐసీసీ టీ20 వరల్డ్‌కప్–2026ను విజయంతో ప్రారంభించిన టీమిండియా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.. ఈ విజయం తర్వాత భారత జట్టు హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఆటగాళ్లకు ప్రత్యేక సర్‌ప్రైజ్ ఇచ్చారు. తమ నివాసానికి టీమిండియాను ఆహ్వానించి, కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆటగాళ్లు, కోచ్‌లు, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు గంభీర్ నివాసానికి విచ్చేశారు.
Read Also: Sports: మొదటి స్థానంలో ఫుట్‌బాల్.. రెండో స్థానంలో క్రికెట్
తదుపరి మ్యాచ్ కోసం ఢిల్లీకి చేరుకుంది టీమిండియా
జట్టు సభ్యుల మధ్య స్నేహ భావం పెంపొందించేందుకు గంభీర్ ఇలాంటి పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ సందర్భంగానూ ఆటగాళ్లకు పార్టీ ఇచ్చారు.కోచ్‌గా గంభీర్, జట్టుకు ఇలా డిన్నర్ ఇవ్వడం ఇది రెండోసారి. గతంలో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టెస్టు జట్టుకు కూడా ఢిల్లీలో మ్యాచ్‌కు ముందు విందు ఇచ్చాడు.
ఆటగాళ్లతో వ్యక్తిగత సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగానే గంభీర్ ఈ కార్యక్రమాలు చేపడుతున్నాడని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. సూర్యకుమార్ యాదవ్ సేన, తమ తదుపరి మ్యాచ్ కోసం ఢిల్లీకి చేరుకుంది. ఫిబ్రవరి 12న అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో భారత్ తలపడనుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: