Gary Kirsten Comments on PCB: విశ్వవిజేత కోచ్‌గా గుర్తింపు పొందిన గ్యారీ కిర్‌స్టెన్ (Gary Kirsten), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అంతర్గత వ్యవహారాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలలకే రాజీనామా చేసిన కిర్‌స్టెన్, పీసీబీలోని ‘వర్క్ కల్చర్’ ఎంత దారుణంగా ఉందో వివరిస్తూ సంచలన నిజాలను బయటపెట్టారు.
Read Also: Virat Kohli Speech RCB Training Camp 2026: ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ స్ట్రాంగ్ వార్నింగ్
Gary Kirsten Comments on PCB: కిర్‌స్టెన్ వెల్లడించిన ప్రధానాంశాలు
“నేను చూసిన జట్లలో ఇంత స్థాయి జోక్యం ఎక్కడా చూడలేదు. కోచ్‌గా వచ్చి ప్లేయర్లతో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే బయట నుంచి వచ్చే ఈ నాయిస్ చాలా కష్టంగా మారుతుంది” అని కిర్‌స్టెన్ పేర్కొన్నాడు. ముఖ్యంగా మొహ్సిన్ నక్వీ నేతృత్వంలోని పీసీబీ వర్క్ కల్చర్‌పై అసహనం వ్యక్తం చేశాడు. జట్టు ఫలితాలు సరిగా రాకపోతే కోచ్‌పైనే ఒత్తిడి పెంచడం, ఆంక్షలు విధించడం వంటి చర్యలు ప్రతికూలంగా మారతాయని అన్నాడు.
“టీమ్ బాగా ఆడకపోతే కోచ్‌ను తీసేయడం లేదా అతనిపై పరిమితులు పెట్టడం చాలా ఈజీ. కానీ అదే తప్పు. అలా అయితే కోచ్‌ని ఎందుకు నియమిస్తారు?” అంటూ కిర్‌స్టెన్ ప్రశ్నించాడు. ఇక తన భవిష్యత్‌పై కూడా క్లారిటీ ఇచ్చిన కిర్‌స్టెన్, తాజాగా శ్రీలంక క్రికెట్‌తో రెండు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2027 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ కోసం శ్రీలంక జట్టును సిద్ధం చేయడం ప్రధాన బాధ్యతగా ఉంటుంది. ఈ టోర్నమెంట్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: