📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Sourav Ganguly: గంభీర్ వైఖరిపై గంగూలీ అసంతృప్తి

Author Icon By Anusha
Updated: November 17, 2025 • 2:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణాఫ్రికాతో జరిగిన తాజా టెస్టు పోరులో టీమిండియా వ్యూహం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యూహంపై మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) అసంతృప్తి వ్యక్తం చేశాడు. టెస్టు మ్యాచ్‌లను మూడు రోజుల్లో ముగించడం కాకుండా, ఐదు రోజుల పాటు ఆడి గెలవడంపై దృష్టి పెట్టాలని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఆయన సూచించాడు.

Read Also: Kumar Sangakkara: మళ్లీ రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా కుమార సంగక్కర

ఇండియా టుడేతో గంగూలీ మాట్లాడుతూ

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. బౌలర్లకు విపరీతంగా అనుకూలించిన ఈ పిచ్‌పై 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక టీమిండియా 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం పిచ్‌ను తమ జట్టు సూచనల మేరకే క్యూరేటర్ సిద్ధం చేశారని గంభీర్ అంగీకరించాడు.

ఈ నేపథ్యంలో గంగూలీ (Sourav Ganguly) స్పందించారు. ఇండియా టుడేతో గంగూలీ మాట్లాడుతూ.. “అది టెస్టు క్రికెట్‌కు అంత మంచి వికెట్ కాదు. అయినా భారత్ 120 పరుగులు చేసి ఉండాల్సింది. తమకు అలాంటి పిచ్ కావాలని గంభీరే క్యూరేటర్‌కు చెప్పాడని తెలిసింది.

Ganguly unhappy with Gambhir’s attitude

మనం మంచి పిచ్‌లపై ఆడాలి

దీనిపై వివాదం ఏమీ లేదు, కానీ మనం మంచి పిచ్‌లపై ఆడాలి” అని స్పష్టం చేశాడు.గంభీర్ అంటే తనకు ఎంతో ఇష్టమని, అయితే అతని ఆలోచనా విధానంలో మార్పు రావాలని గంగూలీ అభిప్రాయపడ్డాడు.

“గంభీర్ తన బౌలర్లయిన బుమ్రా, సిరాజ్, షమీలతో పాటు స్పిన్నర్ల సామర్థ్యంపై నమ్మకం ఉంచాలి. వాళ్లు ఎలాంటి పిచ్‌పైన అయినా మ్యాచ్‌లు గెలిపించగలరు. టెస్ట్ మ్యాచ్‌లను మూడు రోజుల్లో కాదు, ఐదు రోజుల్లో గెలవాలి” అని గంగూలీ హితవు పలికాడు. టెస్ట్ క్రికెట్ మనుగడకు ఇలాంటి పిచ్‌లు ఏమాత్రం మంచివి కావని క్రీడా విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

eden gardens match Gautam Gambhir pitch strategy India vs South Africa Test latest news Sourav Ganguly reaction Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.