Gambhir: అతనికి కావాల్సింది జట్టు మేనేజ్మెంట్ నుండి సరైన మద్దతు

Read Time:  1 min
Gambhir: అతనికి కావాల్సింది జట్టు మేనేజ్మెంట్ నుండి సరైన మద్దతు
FONT SIZE
GET APP

Gambhir: వెస్టిండీస్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను.. ఓపెనర్ సంజూ శాంసన్ ఒంటి చేత్తో గెలిపించాడు. ఈ టోర్నీ ఆరంభంలో తుది జట్టులో చోటు కోల్పోయిన అతడు.. కీలకమైన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.

Read Also: Mohanlal: సంజూ ఇన్నింగ్స్‌పై నటుడు మోహన్‌లాల్ ప్రశంసల వర్షం

Sanju Samson

గణాంకాలు కాదు.. ఇంపాక్ట్ ముఖ్యం: గంభీర్ విశ్లేషణ

మ్యాచ్ తర్వాత కోచ్ గౌతమ్ గంభీర్ ప్రెస్ మీట్‌ మాట్లాడుతూ, సంజూ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తొలుత ఫామ్‌లో లేకపోవడంతో సంజూపై విమర్శలు వచ్చినప్పటికీ, జట్టులోంచి తొలగించకపోవడం సరికొత్త నిర్ణయం అని, చిన్న కాంట్రిబ్యూషన్‌లను గుర్తించడం ముఖ్యం అని గంభీర్ చెప్పాడు. “టీ20 అంటే గణాంకాల ఆట కాదు. ఆత్మవిశ్వాసం, అనుభవం ముఖ్యం” అని వ్యాఖ్యానించారు.

సహచర ఓపెనర్ అభిషేక్ శర్మ విఫలమైనా.. సంజూ మాత్రం దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. లక్ష్యం భారీగా ఉండటంతో సిక్స్‌లు, ఫోర్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్‌లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. చివరకు 50 బంతుల్లో 97 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్.. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. భారత బ్యాటర్లలో అభిషేక్ శర్మ (10), ఇషాన్ కిషన్ (10), సూర్యకుమార్ యాదవ్ (18) విఫలమయ్యారు. తిలక్ వర్మ (15 బంతుల్లో 27 రన్స్) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా బ్యాటింగ్ చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.