Gautam Gambhir: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కృత్రిమ మేధ (AI) ద్వారా సృష్టించబడుతున్న డీప్ ఫేక్ (Deepfake) వీడియోలపై చట్టపరమైన పోరాటానికి దిగారు. తన అనుమతి లేకుండా తన పేరు, ముఖం, గొంతును ఉపయోగించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: IPL 19 Tickets: ఐపీఎల్ 19వ సీజన్ టికెట్ల విక్రయాలు షురూ

పిటిషన్‌లో ప్రధానాంశాలు
తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణతో పాటు రూ.2.5 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని ఆ పిటిషన్‌లో కోరాడు. అలాగే డీప్ ఫేక్ కంటెంట్‌ను తక్షణమే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. ఇది వ్యక్తిత్వ హననం మాత్రమే కాదని, ఏఐని వినియోగిస్తున్న సమయంలో చట్టం, గౌరవానికి సంబంధించిన అంశంగా పరిగణించాలని అన్నాడు. తన గుర్తింపు, పేరు, తన స్వరాన్ని ఆయుధంగా ఉపయోగించి అనధికారిక ఖాతాల్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని అన్నాడు. తన పేరును వినియోగించి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని కోర్టుకు తెలిపాడు.
గంభీర్ మాట్లాడినట్లుగా పలు డీప్ ఫేక్ వీడియోలను సృష్టించారు. గౌతమ్ గంభీర్ తన ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశాడంటూ ఓ వీడియో వైరల్ కాగా దానికి 29 లక్షల వ్యూస్ వచ్చాయి. మరో వీడియోలో సీనియర్ క్రికెటర్లపై అసభ్యకరంగా మాట్లాడినట్లు ఉంది. ఈ వీడియోను 17 లక్షల మందికి పైగా చూశారు. దీనితో 16 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ హైకోర్టులో గంభీర్ పిటిషన్ దాఖలు చేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: