ఇప్పటికే క్రికెట్ అభిమానుల మధ్య పెద్ద చర్చకు కారణమవుతున్న విషయం అంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Virat Kohli, Rohit Sharma) ల క్రికెట్ భవిష్యత్తు. ముఖ్యంగా ఆస్ట్రేలియాపై మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ (Shubman Gill)ను భారత్ కు కొత్త వన్డే (ODI) కెప్టెన్ గా ప్రకటించిన అనంతరం ఈ చర్చ తెరపైకి వచ్చింది. ఈ సిరీస్ అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఈ సిరీస్‌కు కేవలం బ్యాటర్లుగా మాత్రమే జట్టులోకి తీసుకున్నారు.
Mohammed Shami: ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై స్పందించిన షమీ
అయితే వారి పాత్రపై ఉన్న అనిశ్చితి ఈ చర్చకు దారితీసింది. 2027 వన్డే ప్రపంచ కప్‌ను జట్టు ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవడంతో ఆస్ట్రేలియా పర్యటన ఈ ఇద్దరు అంతర్జాతీయ కెరీర్లో చివరి ఘట్టం కావచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిసన్ (Steve Harmison) సంచలన వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) కు ముందుముందు గడ్డు కాలం తప్పదని, ఆయన పదవీకాలం గందరగోళంగా ముగిసే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. భారత క్రికెట్‌లో మాజీ కెప్టెన్లతో పోలిస్తే మాజీ ఆల్‌రౌండర్ అయిన అగార్కర్‌కు గెలిచే అవకాశాలు తక్కువని ఆయన అభిప్రాయపడ్డాడు.
ఆ ఇద్దరు ఆటగాళ్లు భారత్‌కు ముఖ్యమే
ఆయన ఇంకా మాట్లాడుతూ, “అయితే, అగార్కర్ కేవలం కోహ్లి, రోహిత్ శర్మల మధ్య అగ్నిని రాజేయడానికి ఇలా చెబుతున్నట్లయితే, అది పర్వాలేదు. మీ పత్రాలను (పాచికలు) విప్పి, ఏమి జరుగుతుందో చూడండి,” అన్నారు.ఆ ఇద్దరు ఆటగాళ్లు భారత్‌కు ముఖ్యమే అయినప్పటికీ, వన్డే క్రికెట్‌లో కోహ్లి ప్రభావం చాలా ఎక్కువ అని స్టీవ్ హార్మిసన్ (Steve Harmison) వివరించారు.
ఆయన మాట్లాడుతూ, “కోహ్లికి కొంచెం ఎక్కువ బలం ఉందని నేను భావిస్తున్నాను. కోహ్లీ ఖాతాలో పరుగులు ఉన్నాయి, అతనికంటూ ఒక పేరు ఉంది. రోహిత్ శర్మ (Rohit Sharma) కు అంతగా లేదు. రోహిత్ శర్మ కొంచెం పెద్దవాడు. అతను విరాట్ అంత ప్రభావవంతమైన వన్డే క్రికెటర్‌గా లేడు” అని అన్నారు.
మాజీ ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ హెచ్చరించారు
సెలెక్టర్లు కోహ్లీ లేకుండా జట్టును నిర్మించడానికి ప్రయత్నిస్తే, భారత్ ఆయన లేని లోటును తీవ్రంగా అనుభవిస్తుందని మాజీ ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్ (Steve Harmison) హెచ్చరించారు.ఒక విరాట్ లేకుండా ప్రపంచ కప్ కు వెళ్తే.. ఆస్ట్రేలియా (Australia) లేదా ఇంగ్లాండ్‌పై 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు నంబర్ నాలుగులో గేమ్ గెలిపించగలిగే 90 సగటు ఉన్న ఆటగాడు లేకపోతే జట్టు ఎక్కడ ఉంటుందో చూడాలని అన్నారు.
అజిత్ అగార్కర్ పోరాటం కావాలని కోరుకుంటే.. అతనికి అది లభిస్తుంది కానీ అతను గెలవలేడన్నారు. వచ్చే వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ జట్టులో లేకపోతే, జట్టు ఓడిపోవడం ప్రారంభిస్తే, భారత జట్టు ఆయనను చాలా మిస్ అవుతుందని ఆయన సరదాగా అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: