📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Mohammed Kaif: ఆస్ట్రేలియా సిరీస్ .. భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి

Author Icon By Anusha
Updated: October 10, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాజీ భారత క్రికెటర్ మహమ్మద్ కైఫ్ (Mohammed Kaif) తాజాగా టీమిండియా సెలెక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) స్థానంలో యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ కు అవకాశం ఇవ్వడాన్ని ఆయన తప్పు నిర్ణయంగా అభివర్ణించారు.

India vs West Indies: వెస్టిండీస్‌తో రెండో టెస్టులో టాస్ గెలిచిన భారత్

భారత జట్టులో సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో, ఈ సిరీస్‌లో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశ్యం ఉన్నా, అనుభవజ్ఞుడు అయిన సంజూను పక్కనపెట్టడం సరైంది కాదని కైఫ్ (Mohammed Kaif) పేర్కొన్నారు.ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) అద్భుతమైన ఆటగాడని, భారత క్రికెట్ భవిష్యత్తు అతడేనని కైఫ్ ప్రశంసించారు. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో జురెల్ చేసిన సెంచరీ అతని ప్రతిభకు నిదర్శనమని అన్నారు. “జురెల్ చాలా చక్కగా ఆడాడు.

అతను కచ్చితంగా భవిష్యత్ స్టార్. కానీ సంజూ శాంసన్‌ను పక్కనపెట్టడం మాత్రం తప్పుడు నిర్ణయం. ఎందుకంటే 5వ లేదా 6వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి జురెల్ కంటే శాంసన్ చాలా ఉత్తమమైన ఆటగాడు” అని కైఫ్ తన యూట్యూబ్ ఛానల్‌లో అభిప్రాయపడ్డారు.లోయర్ ఆర్డర్‌లో భారీ షాట్లు, ముఖ్యంగా సిక్సర్లు కొట్టగల ఆటగాడు అవసరమని, ఆ సామర్థ్యం శాంసన్‌కు పుష్కలంగా ఉందని కైఫ్ వివరించారు.

Mohammed Kaif

వికెట్ కీపర్ స్థానం కోసం

“ఆ స్థానంలో స్పిన్నర్లపై సిక్సర్లు బాదగల ఆటగాడు కావాలి. ఆసియా కప్‌ (Asia Cup) లో సంజూ సత్తా ఏంటో మనం చూశాం. అతడు ఆస్ట్రేలియాకు వెళ్లి ఉంటే, ఆడమ్ జంపా (Adam Zampa) లాంటి స్పిన్నర్లను సులభంగా ఎదుర్కొని భారీ షాట్లు ఆడేవాడు. ఐపీఎల్‌ (IPL) లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్-10 ఆటగాళ్లలో సంజూ ఒకడు.

ఆస్ట్రేలియా పరిస్థితులకు అతను సరిగ్గా సరిపోతాడు” అని పేర్కొన్నాడు.సెలెక్టర్లు కేవలం ఇటీవలి ఫామ్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుని, ఎప్పటినుంచో నిలకడగా రాణిస్తున్న సంజూ లాంటి ఆటగాళ్లను విస్మరించడం సరికాదని కైఫ్ హితవు పలికాడు.కాగా, భారత జట్టులో కేఎల్ రాహుల్ ప్రధాన వికెట్ కీపర్‌గా కొనసాగుతున్నాడు.

రిషబ్ పంత్ గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో రెండో వికెట్ కీపర్ స్థానం కోసం పోటీ ఏర్పడింది. మిడిలార్డర్‌లో అవసరమైతే మెరుగ్గా ఆడగలడనే ఉద్దేశంతోనే సంజూ కంటే జురెల్‌కు ప్రాధాన్యం ఇచ్చినట్లు సెలెక్టర్ల చైర్మన్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చెప్పినట్లు తెలిసింది. ఆసియా కప్ టీ20 టోర్నీలో శాంసన్ 5వ స్థానంలో విఫలమయ్యాడని సెలెక్టర్లు భావించినట్లు సమాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News India vs Australia ODI series latest news Mohammed Kaif Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.