Suryakumar Yadav: అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

Read Time:  1 min
Suryakumar Yadav: అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం
FONT SIZE
GET APP

Suryakumar Yadav: భారత టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటికి (మార్చి 14, 2026) సరిగ్గా ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన 102 సెకన్ల ఎమోషనల్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. “5 ఏళ్ల క్రితం ఒక కల నిజమైంది. భారత జెర్సీని ధరించడం అనేది ఇప్పటికీ నేను మాటల్లో వర్ణించలేని గొప్ప అనుభూతి” అంటూ ఆయన తన మనసులోని మాటను పంచుకున్నారు. తొలి బంతికే సిక్సర్.. అహ్మదాబాద్‌తో అనుబంధం

Read Also: IPL 2026: వినూత్నంగా కేకేఆర్ జెర్సీ

సరిగ్గా ఐదేళ్ల క్రితం,సూర్య‌కుమార్ 2021, మార్చి 14వ తేదీన అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట‌ర‌య్యాడు. అప్పుడు అత‌ని వ‌య‌సు 30 ఏళ్లు 181 రోజులు. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన టీ20 మ్యాచ్‌తో అత‌ను అరంగేట్రం చేశాడు. అయితే అదే వేదిక‌పై సూర్య తాజాగా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను అందుకున్నారు. సూర్య త‌న టీ20 కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 113 మ్యాచ్‌లు ఆడి, వాటిల్లో 3272 ర‌న్స్ చేశాడు. దీంట్లో నాలుగు సెంచ‌రీలు, 25 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన మూడ‌వ బ్యాట‌ర్‌గా నిలిచాడు. అత‌నికంటే ముందు రోహిత్ శ‌ర్మ‌ (4231), విరాట్ కోహ్లీ(4188) ఉన్నారు.

Suryakumar Yadav opens up on India's T20 World Cup triumph, leadership  challenges and Olympic dream - Telangana Today

2021 జూలై 18వ తేదీన వ‌న్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. కొలంబోలో శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అత‌ను వ‌న్డే కెరీర్ ప్రారంభించాడు. ఆ త‌ర్వాత 2023లో నాగ‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో టెస్టు అరంగేట్రం చేశాడు. 2022లో ఐసీసీ మెన్స్ టీ20 క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు అందుకున్నాడు. తాజాగా ముగిసిన వ‌రల్డ్‌క‌ప్‌లో అత‌ను 242 ర‌న్స్ స్కోరు చేశాడు. బార్బ‌డోస్‌లో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన రోహిత్ జ‌ట్టులో సూర్య స‌భ్యుడిగా ఉన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.