ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక బిగ్ బాష్ లీగ్‌లో మరో అరుదైన ఘనత నమోదైంది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ఫిన్ అలెన్ చరిత్ర సృష్టించాడు.పెర్త్ స్కార్చర్స్ తరపున ఆడుతున్న అలెన్, కీలకమైన క్వాలిఫయర్ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్‌పై తన పవర్ హిట్టింగ్‌తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 30 బంతుల్లో 49 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు.
Read Also: Under-19 World Cup: వరల్డ్ కప్ లో విల్ మలాచిక్ సెంచరీ
ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా ఫిన్ అలెన్
ఈ ఏడాది బిగ్ బాష్ లీగ్‌లో 10 ఇన్నింగ్స్‌లు ఆడిన ఫిన్ అలెన్ ఇప్పటివరకు 37 సిక్సర్లు బాదాడు. దీంతో బీబీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.ఈ రికార్డు గతంలో 2024-25 బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో 36 సిక్సర్లు కొట్టిన మిచెల్ ఓవెన్ పేరిట ఉంది.ఇప్పుడు ఈ రికార్డును ఫిన్ అలెన్ బద్దలు కొట్టాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: