📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Finn Allen: భారత్ పర్యటనే మా విజయ రహస్యం: అలెన్

Author Icon By Anusha
Updated: March 5, 2026 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Finn Allen: కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ అద్భుత విజయాన్ని అందుకుంది. టోర్నీలో అపజయమన్నదే లేకుండా దూసుకొచ్చిన దక్షిణాఫ్రికాకు కివీస్ షాక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లలోనే ఛేదించింది. 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, సగర్వంగా టైటిల్ పోరుకు అర్హత సాధించింది.

Read Also: MS Dhoni traffic fine : ధోనీకి జరిమానా, రాంచీలో వేగం మించిన వాహనం

ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా.. 33 బంతుల్లోనే సెంచరీ!

కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో ఊచకోత కోస్తూ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. మరో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (33 బంతుల్లో 58) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో కివీస్ విజయం నల్లేరుపై నడకలా సాగింది. ఈ అద్భుత విజయం తర్వాత ఫిన్ అలెన్ మాట్లాడుతూ.. తమ గెలుపు వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెట్టాడు. ప్రపంచకప్‌కు ముందు భారత్‌లో పర్యటించి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడటమే తమకు ఎంతగానో ఉపయోగపడిందని స్పష్టం చేశాడు. “ప్రపంచకప్‌కు ముందు మా కుర్రాళ్లు భారత్‌లో ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడారు.

Finn Allen: India tour is the secret to our success

అక్కడి బ్లాక్ సాయిల్ పిచ్‌లపై ఆడిన అనుభవం అమూల్యమైనది. అలాంటి సన్నద్ధతను మరెక్కడా పొందలేం. ఆ సిరీస్‌లో ఫలితాలు మాకు అనుకూలంగా రాకపోయినా, ఒక జట్టుగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం” అని అలెన్ వివరించాడు.ఈ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారని అలెన్ ప్రశంసించాడు. “మా బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు తీసి ఒత్తిడి పెంచడం ద్వారా మా బ్యాటర్ల పనిని సులభతరం చేశారు” అని చెప్పాడు. అలాగే, మరో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (33 బంతుల్లో 58) గురించి మాట్లాడుతూ, “అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బౌండరీలతో విరుచుకుపడుతూ దక్షిణాఫ్రికాకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. అతను అలా ఆడుతుంటే చూడటానికి అద్భుతంగా ఉంటుంది” అని అలెన్ పేర్కొన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Eden Gardens Kolkata Cricket News finn allen fastest century New Zealand Final Entry NZ vs SA T20 WC Semi Final 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.