📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

T20 Cricket : ఉత్కంఠభరిత పోరులో చివరకు నెదర్లాండ్స్ విజయం

Author Icon By Divya Vani M
Updated: June 17, 2025 • 10:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీ20 క్రికెట్‌ (T20 Cricket) చరిత్రలో కనీవినీ ఎరుగని క్షణం ఇది. నెదర్లాండ్స్, నేపాల్ (Netherlands, Nepal) మధ్య జరిగిన మ్యాచ్ మూడు సూపర్ ఓవర్ల వరకు వెళ్లింది. ఇదే పురుషుల టీ20 క్రికెట్‌లో తొలి సారి కావడం విశేషం. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ ఉత్కంఠ రేపింది. చివరికి నెదర్లాండ్స్ విజయం సాధించింది.చివరి ఓవర్‌లో నేపాల్‌కు 16 పరుగులు కావాల్సి ఉంది. నందన్ యాదవ్ క్రీజులో ఉండగా, నెదర్లాండ్స్ బౌలర్ కైల్ క్లెయిన్ బంతులు వేసాడు. నందన్ 4, 2, 2, 4 పరుగులతో మ్యాచ్‌ను టై చేశాడు. దీంతో మ్యాచ్ మొదటి సూపర్ ఓవర్‌కు వెళ్లింది.మొదటి సూపర్ ఓవర్‌లో నేపాల్ భారీ స్కోర్ చేసింది. కుశాల్ భుర్తెల్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. నెదర్లాండ్స్ బౌలర్ డేనియల్ డోరమ్ ఆ ఓవర్‌లో 19 పరుగులు ఇచ్చాడు. తర్వాత లెవిట్, ఓడౌడ్ కలిసి మరోసారి స్కోరు సమం చేశారు. మ్యాచ్ రెండో సూపర్ ఓవర్‌కు వెళ్లింది.

రెండో సూపర్ ఓవర్ – మళ్లీ సమం

నెదర్లాండ్స్ తొలి మూడు బంతుల్లో రెండు సిక్సర్లు బాదింది. కానీ నేపాల్ బౌలర్ లలిత్ రాజ్‌బంశీ మిగిలిన బంతుల్లో కట్టడి చేశాడు. చివరకు నెదర్లాండ్స్ 17 పరుగులు చేసింది. నేపాల్ తరఫున రోహిత్ పౌడెల్ సిక్స్, దీపేంద్ర ఫోర్ బాదారు. చివరి బంతికి 7 పరుగులు కావాల్సి ఉండగా, ఐరీ సిక్స్ కొట్టాడు. మరోసారి మ్యాచ్ టై అయింది.

మూడో సూపర్ ఓవర్ – నెదర్లాండ్స్ దెబ్బ

తొలిసారిగా మ్యాచ్ మూడో సూపర్ ఓవర్‌కు వెళ్లింది. నెదర్లాండ్స్ బౌలర్ జాక్ లయన్-కాచెట్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నేపాల్ కెప్టెన్ రోహిత్, రూపేశ్‌ వికెట్లు కోల్పోయారు. నేపాల్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది.తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన లెవిట్… సందీప్ లమిచానే బౌలింగ్‌లో లాంగ్ ఆన్ మీదుగా భారీ సిక్స్ బాదాడు. మూడో సూపర్ ఓవర్‌లో ఒక్క బంతికే మ్యాచ్ ముగిస్తూ నెదర్లాండ్స్‌కు గెలుపు అందించాడు.

Read Also : Iran : ఇరాన్ నుంచి భారతీయుల తరలింపునకు కేంద్రం చర్యలు

CricketRecords HistoricMatch ICCT20 NepalCricket Netherlands_vs_Nepal NetherlandsCricket SuperOver SuperOverDrama T20Cricket T20Thriller

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.