ఫిఫా ప్రపంచకప్ 2026 (FIFA World Cup 2026) ఫైనల్ డ్రా విడుదలైంది. శుక్రవారం వాషింగ్టన్ డీసీలోని జాన్ ఎఫ్. కెన్నెడీ సెంటర్ ఫర్ ది పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కార్యక్రమంలో 48 జట్ల డ్రాను నిర్వాహకులు విడుదల చేశారు. ఈ మెగా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. తొలిసారి 48 జట్లు ప్రపంచకప్ కోసం పోటీ పడుతున్నాయి.
Read Also: Venky Mysore: కేకేఆర్‌కు రసెల్ గుడ్ బై.. వివరణ ఇచ్చిన సీఈఓ
తాజా డ్రా ప్రకారం డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా గ్రూప్ జేలో ఉండగా.. ఆల్జీరియాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది. (FIFA World Cup 2026) 2026 జూన్ 11వ తేదీన టోర్నీ ప్రారంభంకానున్నది. మొత్తం 104 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. గత చాంపియన్ అర్జెంటీనా తమ టైటిల్‌ను డిఫెండ్ చేసుకునేందుకు ట్రై చేయనున్నది.
మేటి ప్లేయర్ లియోనల్ మెస్సీకి చెందిన అర్జెంటీనా తన తొలి మ్యాచ్‌లో అల్జీరియాతో తలపడనున్నది. కేప్ వర్డీ, కురకావో, జోర్డాన్, ఉజ్బకిస్తాన్ దేశాల్లో తమ గ్రూపు ప్రత్యర్థులు ఎవరో తెలుసుకున్నారు. నాలుగు సార్లు చాంపియన్‌షిప్ గెలిచిన జర్మనీతో కురకావో తన ఫస్ట్ మ్యాచ్‌లో పోటీపడనున్నది.
ఇంగ్లండ్ ఈసారి తన ఫస్ట్ మ్యాచ్‌లో క్రొయేషియాతో ఆడనున్నది
మెక్సికో సిటీలో ఉన్న అజ్‌టెకా స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. గ్రూపు ఏలో జూన్ 11వ తేదీన దక్షిణాఫ్రికాతో ఆ మ్యాచ్ ఉండనున్నది. ఇప్పటికే టోర్నీలో పాల్గొనే 42 జట్లు ఖరారు అయ్యాయి. ఇక ప్లేఆఫ్స్ లో ఉన్న ఆరు బెర్తుల కోసం 22 జట్లు పోటీపడనున్నాయి. వాటి ఫలితాలు మార్చి 31వ తేదీ వరకు తెలుస్తుంది. క్వార్టర్ ఫైనల్స్ నుంచి అన్ని మ్యాచ్‌లను అమెరికాలో నిర్వహించనున్నారు.
జూలై 19వ తేదీన న్యూజెర్సీలోని ఈస్ట్ రూథర్‌ఫోర్డ్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనున్నది. 1966లో వరల్డ్‌కప్ టైటిల్ గెలిచిన ఇంగ్లండ్ ఈసారి తన ఫస్ట్ మ్యాచ్‌లో క్రొయేషియాతో ఆడనున్నది. గ్రూప్ ఎల్‌లో ఘనా, పనామా దేశాలు కూడా ఉన్నాయి. ఈసారి మొత్తం 12 గ్రూపుల్లో జట్లు పోటీపడనున్నాయి. ఒక్కొక్క గ్రూపులో నాలుగేసి జట్లు ఉంటాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: