Fanny Utagushi Maninde T20 Century: 15 ఏళ్లకే టీ20 సెంచరీ.. వరల్డ్ రికార్డు నెలకొల్పిన ఫ్యానీ

Read Time:  1 min
Fanny Utagushi Maninde T20 Century: 15 ఏళ్లకే టీ20 సెంచరీ.. వరల్డ్ రికార్డు నెలకొల్పిన ఫ్యానీ
FONT SIZE
GET APP

Fanny Utagushi Maninde T20 Century: క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజులుగా పేరొందిన దిగ్గజాల రికార్డులను టీనేజ్ సంచలనాలు తిరగరాస్తున్నాయి. గత ఏడాది 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సృష్టించిన ప్రకంపనలు మరువకముందే, ఇప్పుడు 15 ఏళ్ల ఫ్యానీ ఉటాగుషి మానిండే (Fanny Utagushi Maninde) మహిళల టీ20 క్రికెట్‌లో కనీవినీ ఎరుగని చరిత్ర సృష్టించింది. 15 సంవత్సరాలు 223 రోజుల వయసులోనే సెంచరీ నమోదు చేసి, ఉగాండాకు చెందిన ప్రోస్కోవియా అలాకో పేరిట ఉన్న యంగెస్ట్ టీ20 సెంచరీ రికార్డును చెరిపేసింది.

Read Also: TG Sports Budget: తెలంగాణ క్రీడారంగానికి ₹500 కోట్ల బడ్జెట్

డెబ్యూలోనే విధ్వంసం: ఆస్ట్రేలియా లెజెండ్ రికార్డు బ్రేక్!

ఆలాకో 2019లో 16 సంవత్సరాలు 233 రోజుల వయసులో ఈ రికార్డు సాధించింది. ఇక పురుషుల క్రికెట్‌లో ఈ రికార్డు ఫ్రాన్స్ ఆటగాడు గుస్తావ్ మెక్‌కియోన్ పేరిట ఉంది.ఘానాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఫ్యానీ ఉటాగుషి మానిండే కేవలం 65 బంతుల్లోనే 111 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు ఉండటం విశేషం. స్ట్రైక్ రేట్ 170కి పైగా ఉండటం ఆమె దూకుడును చూపిస్తోంది. మహిళల టీ20 చరిత్రలో డెబ్యూలో అత్యధిక స్కోరు రికార్డు కూడా ఇప్పుడు ఫ్యానీ పేరిటే ఉంది. ఇంతకుముందు ఆస్ట్రేలియా లెజెండ్ కరీన్ రోల్టన్ 2005లో ఇంగ్లాండ్‌పై చేసిన 96 నాటౌట్ స్కోరు రికార్డు కాగా, ఇప్పుడు అది బ్రేక్ అయింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రువాండా జట్టు 20 ఓవర్లలో 210/3 భారీ స్కోరు నమోదు చేసింది. ఫ్యానీతో పాటు గిసెల్ ఇషిమ్వే (14), క్లారిస్ ఉవాసే (15), మర్వెయిల్ ఉవాసే (32) పరుగులు చేశారు. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఘానా జట్టు 88/8కే పరిమితమైంది. రువాండా బౌలింగ్‌లో బెలీస్ మురేకటేట్ 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను పూర్తిగా తమ వైపు తిప్పింది. ఈ మ్యాచ్‌లో ఫ్యానీ ఉటాగుషిమానిండే అద్భుత ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.