📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

ఇంగ్లాండ్ 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభం

Author Icon By Divya Vani M
Updated: February 5, 2025 • 11:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకున్న భారత్ ఇప్పుడు వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టింది. రేపటి నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది గురువారం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ (వీసీఏ) స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. ఈ సిరీస్‌లో టీమిండియా స్పీడ్‌స్టార్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా లేకపోవడంతో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ బౌలింగ్ దళాన్ని నడిపించనున్నాడు.అయితే ఈ మ్యాచ్‌కు ముందు షమీకి ఒక విశేషమైన అవకాశం ఉన్నది ఇప్పటివరకు 101 వన్డేల్లో 195 వికెట్లు సాధించిన షమీ నాగ్‌పూర్‌లో కనీసం ఐదు వికెట్లు తీస్తే, ప్రపంచ రికార్డు సాధించవచ్చు. అలా చేస్తే ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్‌తో ప్రపంచ రికార్డును సమం చేస్తాడు.

ఇంగ్లాండ్ 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభం

స్టార్క్ 102 వన్డే మ్యాచ్‌లలో తన 200వ వికెట్‌ను సాధించాడు. రేపు షమీ ఐదు వికెట్లు తీస్తే అదే రికార్డు సృష్టించవచ్చు.భారత్ తరపున వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు సాధించిన బౌలర్‌గా అజిత్ అగార్కర్ రికార్డును కలిగి ఉన్నారు. 2004 డిసెంబర్ 26న ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన 133వ వన్డేలో అగార్కర్ తన 200వ వికెట్‌ను సాధించాడు. ఇంతవరకు వన్డేల్లో భారత్ తరఫున 200కి పైగా వికెట్లు సాధించిన ఏడుగురు బౌలర్లు మాత్రమే ఉన్నారు. రాబోయే మ్యాచ్‌ల్లో షమీ ఐదు వికెట్లు తీస్తే ఈ జాబితాలో చేరే ఎనిమితి బౌలర్ అవుతాడు. అయితే భారత వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉంది. కుంబ్లే 269 వన్డేల్లో 334 వికెట్లు తీశాడు ఇది ప్రస్తుతం కూడా ఒక అద్భుతమైన మైలురాయి. షమీ ప్రస్తుతం కెరీర్‌లో అత్యంత కీలక మలుపు చేరుకున్న వేళ ఆయన రికార్డును సాధిస్తే భారత క్రికెట్ చరిత్రలో మరో ఘనత జోడించబడుతుంది.

IndiaCricket IndiaVsEngland MohammadShami NagpurODI ODISeries T20Series WorldRecord

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.