📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

Will jacks innings : జాక్స్ దూకుడు, కివీస్‌పై ఇంగ్లండ్ సంచలన విజయం

Author Icon By Sai Kiran
Updated: February 28, 2026 • 9:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Will jacks innings : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించింది. న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. యువ ఆటగాళ్లు విల్ జాక్స్, రెహాన్ అహ్మద్ ఆఖరి ఓవర్లలో అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను తిప్పేశారు.

160 పరుగుల లక్ష్యంతో ఛేదన ప్రారంభించిన ఇంగ్లండ్ మధ్య ఓవర్లలో వరుస వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అయితే చివరి ఓవర్లలో విల్ జాక్స్ (22 బంతుల్లో 41*), రెహాన్ అహ్మద్ (9 బంతుల్లో 24*) మెరుపు ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరమైన సమయంలో తొలి మూడు బంతుల్లోనే లక్ష్యాన్ని చేరుకుని జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.

Read Also: Delhi Liquor: మద్యం పాలసీ కేసు కొట్టివేత..కేజ్రీవాల్‌ కన్నీటిపర్యంతం

Will jacks innings

మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఓటమిపై స్పందిస్తూ, ఇంగ్లండ్ యువ ఆటగాళ్లను ప్రశంసించాడు. “ఇది చాలా హోరాహోరీ పోరు. జాక్స్, రెహాన్ చివరి ఓవర్లలో అద్భుతంగా ఆడి మ్యాచ్‌ను మా చేతుల్లోంచి లాగేశారు. మేము కీలక సమయాల్లో ఒత్తిడికి లోనయ్యాం. ఇంకొంచెం పరుగులు ఎక్కువగా చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేదేమో” అని అన్నాడు.

ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ఒత్తిడిలో యువ ఆటగాళ్లు చూపిన ధైర్యాన్ని కొనియాడాడు. అదే సమయంలో జోస్ బట్లర్‌పై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ, “బట్లర్ మా జట్టుకు కీలక ఆటగాడు. ప్రతి గొప్ప ఆటగాడికి ఇలాంటి దశలు వస్తాయి. అతను త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడు” అని విశ్వాసం వ్యక్తం చేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

cricket match highlights 2026 england semifinal chances england thrilling win england vs new zealand t20 world cup 2026 Google News in Telugu harry brook captaincy jos buttler form news mitchell santner reaction rehan ahmed batting t20 world cup super 8 match Telugu News will jacks innings

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.