📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు గుజరాత్‌పై ఢిల్లీ ఘనవిజయం.. ఫైనల్లో ఆర్సీబీతో ఢీ టీమిండియా ప్లేయింగ్ 11 ప్రకటించిన చాహల్ టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటున్న జట్లన్నీ ప్రమాదకరమైనవే: ధోనీ పాక్ డ్రామా’ క్రికెట్‌కు నష్టం, ఐపీఎల్‌కే లాభం లలిత్ మోదీ సంచలనం! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు

ENG vs PAK: ఉత్కంఠ పోరులో పాక్ పై ఇంగ్లాండ్ విజయం

Author Icon By Aanusha
Updated: February 25, 2026 • 12:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ENG vs PAK: టీ20 ప్రపంచకప్‌లో అత్యంత కీలకమైన సూపర్-8 దశలో ఇంగ్లాండ్ జట్టు తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మంగళవారం పాకిస్థాన్‌తో జరిగిన పోరులో ఇంగ్లాండ్ 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.పల్లెకెలె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది.

Read Also: LSG logo 2026 : లక్నో జట్టు కొత్త లోగో రిలీజ్, ఎరుపు రంగు హాట్ టాపిక్!

హారీ బ్రూక్ ‘కెప్టెన్’ ఇన్నింగ్స్: ఆకాశమే హద్దుగా బాదుడు

ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (0), జోస్ బట్లర్ (2) ఘోరంగా విఫలమయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఒంటిచేత్తో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కేవలం 51 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 100 పరుగులు చేసి జట్టును విజయానికి చేరువ చేశాడు.అయితే బ్రూక్ సెంచరీ తర్వాత ఔటవ్వడంతో మ్యాచ్ ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. ఆ వెంటనే నవాజ్ బౌలింగ్ లో విల్ జాక్స్ (28), జేమీ ఓవర్టన్ (0) కూడా ఒకే ఓవర్లో వెనుదిరగడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది.

ENG vs PAK: England win in thrilling match

ఒకానొక దశలో పాకిస్థాన్ గెలుస్తుందనిపించింది. కానీ చివర్లో జోఫ్రా ఆర్చర్ (5) కీలక బౌండరీ బాదడంతో ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 4 వికెట్లతో సత్తా చాటాడు.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఆ జట్టులో సాహిబ్జాదా ఫర్హాన్ (63) అర్ధ సెంచరీతో రాణించాడు. బాబర్ ఆజం (25), ఫఖర్ జమాన్ (25) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లు పడగొట్టగా, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్ చెరో రెండు వికెట్లు తీశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ENG vs PAK Harry Brook century Shaheen Afridi 4 Wickets T20 WC 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.