Dinesh Karthik-Dipika Pallikal: టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్, ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ మళ్లీ తల్లిదండ్రులయ్యారు. తమ కుటుంబంలోకి మూడవ సంతానంగా ఆడబిడ్డ జన్మించిందని ఈ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
Read Also: Ram Charan Tilak Varma Meeting: ‘పెద్ది’ సెట్స్‌లో తిలక్ వర్మ సందడి!
పాప పేరు ‘రాహా పల్లికల్ కార్తీక్’
తమ గారాల పట్టికి ‘రాహా పల్లికల్ కార్తీక్’ అని పేరు పెట్టినట్లు ఈ స్టార్ దంపతులు వెల్లడించారు. “మా హృదయాల్లో నిండిన ఆశీస్సులు, వర్ణించలేని కృతజ్ఞతతో మా అమూల్యమైన అమ్మాయిని ఈ ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నాము” అంటూ తమ భావోద్వేగాన్ని పంచుకున్నారు.ఈ దంపతులకు 2015లో వివాహం కాగా, 2021లో కబీర్, జియాన్ అనే కవల అబ్బాయిలు జన్మించిన విషయం తెలిసిందే.
దినేశ్ కార్తీక్ రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్‌కు సేవలందించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు దీపిక పల్లికల్ భారత స్క్వాష్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రపంచ టాప్-10 ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన దీపిక, గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: