📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20

Dhanashree Varma: మొదటిసారి చాహల్‌తో విడాకులపై స్పందించిన ధనశ్రీ వర్మ

Author Icon By Anusha
Updated: August 20, 2025 • 10:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ వ్యక్తిగత జీవితం కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. ఆయన మాజీ భార్య, ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ (Dhanashree Varma) తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విడాకులు ఎంతగా చర్చనీయాంశమయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే ఇంతవరకు ఈ విషయంపై ధనశ్రీ పెద్దగా స్పందించలేదు. కానీ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె తొలిసారి తన మనసులోని బాధను వెలిబుచ్చారు.ముంబైలో ప్రసారం అవుతున్న ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ పాడ్‌కాస్ట్‌లో ధనశ్రీ మాట్లాడుతూ.. విడాకుల రోజు తనకు ఎదురైన మానసిక వేదనను గుర్తుచేసుకున్నారు. “ఆ రోజు కోర్టులో మేమిద్దరం మానసికంగా సిద్ధంగా ఉన్నాం. కానీ న్యాయమూర్తి తీర్పు ఇవ్వబోతున్న సమయంలో నా మనసు అదుపు చేసుకోలేకపోయాను. కన్నీళ్లు ఆపలేకపోయాను. అందరి ముందే గట్టిగా ఏడ్చేశాను. ఆ క్షణంలో నా మనసు ఏ స్థితిలో ఉందో చెప్పలేని పరిస్థితి” అని ఆమె అన్నారు.

టీ-షర్ట్‌కు సంబంధించిన వీడియోలు చూసి ఆశ్చర్యపోయా

ఆ తర్వాత చాహల్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు” అని ఆమె వివరించారు.విడాకుల సమయంలో చాహల్ (Yuzvendra Chahal) ‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించడం పెద్ద వివాదానికి దారితీసింది. ఈ విషయంపై ధనశ్రీ స్పందిస్తూ, “ఈ విషయంలో ప్రజలు నన్నే నిందిస్తారని మాకు ముందే తెలుసు. ఆ టీ-షర్ట్ ఉదంతం గురించి తెలిసేలోపే, నింద నాపైకే వస్తుందని మేము ఊహించాం” అని అన్నారు. కోర్టు నుంచి బయటకు వచ్చాక చాహల్ టీ-షర్ట్‌కు సంబంధించిన వీడియోలు చూసి ఆశ్చర్యపోయానని ఆమె తెలిపారు. “అరే భాయ్, వాట్సాప్‌ (WhatsApp) లో అయినా చెప్పొచ్చు కదా. ఆ టీ-షర్ట్ ఎందుకు వేసుకున్నాడు?” అని ఆమె వ్యాఖ్యానించారు.ఇలాంటి సున్నితమైన విషయాల్లో ఎంతో పరిణతితో వ్యవహరించాలని తాను భావించానని ధనశ్రీ పేర్కొన్నారు. “ప్రజలను ఆకట్టుకోవడం కోసం అనాలోచిత వ్యాఖ్యలు చేయడం నాకు ఇష్టం లేదు.

Dhanashree Varma

అన్నింటినీ సర్దుకుపోవాలని

మా కుటుంబ విలువలను, అతని కుటుంబ గౌరవాన్ని కాపాడాలనుకున్నాను” అని ఆమె తెలిపారు.సమాజంలో మహిళలను ఎలా చూస్తారో వివరిస్తూ, “ఒక మహిళగా బంధాన్ని నిలబెట్టుకోవాలని, అన్నింటినీ సర్దుకుపోవాలని మనకు నేర్పిస్తారు. మన సమాజం గురించి మన తల్లులకు బాగా తెలుసు కాబట్టే అలా చెబుతారు. చివరికి నీమీదే ఓ ముద్ర వేస్తారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.పెళ్లి బంధంలో ఉన్నప్పుడు చాహల్‌కు తాను అన్నివిధాలా అండగా నిలిచానని, చిన్నచిన్న విషయాల నుంచి పెద్ద విషయాల వరకు తోడుగా ఉన్నానని ధనశ్రీ గుర్తుచేసుకున్నారు. బహుశా ఆ కారణంతోనే తనలోని భావోద్వేగాలు బయటకు వచ్చి ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, 2020లో వివాహం చేసుకున్న చాహల్, ధనశ్రీ వర్మ ఐదేళ్ల వివాహ‌బంధానికి స్వ‌స్తిప‌లికి ఇటీవ‌ల‌ విడిపోయిన విషయం తెలిసిందే.

ధనశ్రీ వర్మ ఎక్కడ జన్మించారు?

ఆమె ముంబై, మహారాష్ట్రలో జన్మించారు.

ధనశ్రీ వర్మ వృత్తి ఏంటి?

ఆమె డాన్స్ చోరియోగ్రాఫర్, యూట్యూబ్‌లో డాన్స్ క్లాసులు, వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యారు. అదనంగా సోషల్ మీడియా ద్వారా అనేక బ్రాండ్ల ప్రమోషన్లు చేస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ajit-agarkar-ajit-agarkars-explanation-on-not-selecting-shreyas-iyer/sports/532766/

Breaking News Dhanashree Verma podcast Dhanashree Verma statement Humans of Bombay podcast latest news Telugu News Yuzvendra Chahal divorce

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.