ఐపీఎల్ లో మరో కీలక మలుపు తిరిగింది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ ప్రముఖ ఓపెనర్ డెవాన్ కాన్వే (Devon Conway) ను వదిలేసుకున్నట్లు తెలుస్తోంది..ఈ విషయాన్ని కాన్వే స్వయంగా తన X ఖాతాలో పోస్ట్ చేసి ధృవీకరించారు. మూడేళ్ల పాటు తమను మద్దతుగా నిలిచిన CSK అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. ఎల్లో జెర్సీలో గడిపిన ఆనందమయ జ్ఞాపకాలను షేర్ చేస్తూ, ఈ జర్నీని మరపురాని అధ్యాయంగా వర్ణించారు.
Read Also: IND vs SA: తొలి రోజు ఆటలో గెలుపు టీమిండియాదే

జట్టుకు విలువైన భాగస్వామ్యాలు అందించారు
కాన్వే పోస్ట్: “Thank you to all loyal fans of CSK for amazing 3 years support” అని రాశారు. ఈ పోస్ట్ అభిమానుల్లో భావోద్వేగాలను రేకెత్తించింది. ఐపీఎల్ (IPL) లో CSK తరఫున 29 మ్యాచులు ఆడిన కాన్వే 43.2 సగటుతో 1080 పరుగులు చేశారు. ఇందులో 11 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఓపెనర్‌గా జట్టుకు విలువైన భాగస్వామ్యాలు అందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: