📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

Delhi Capitals: కెనడాలో తొలి క్రికెట్ అకాడమిని ప్రారంభించిన డీసీ

Author Icon By Anusha
Updated: December 27, 2025 • 10:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తన క్రికెట్ కార్యకలాపాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించడంలో వేగం పెంచింది. ఇప్పటికే లండన్‌లో ఒక అంతర్జాతీయ క్రికెట్ అకాడమీని నిర్వహిస్తున్న ఈ ఫ్రాంచైజీ, తాజాగా ఉత్తర అమెరికా ఖండంలోకి ప్రవేశించింది. కెనడాలోని అంటారియో రాష్ట్రం, మిస్సిసాగా నగరంలో తన తొలి క్రికెట్ అకాడమీని అధికారికంగా ప్రారంభించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) కు ఇది రెండో అంతర్జాతీయ అకాడమీ కావడం విశేషం.ప్రపంచంలో క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో కెనడా ఒకటి.

Read Also: Women T20: భారత మహిళా క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన దీప్తీ శర్మ

యువ క్రికెటర్లకు శిక్షణ అందించడమే లక్ష్యం

ఈ ప్రాంతంలోని యువ క్రికెటర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నత స్థాయి శిక్షణ అందించడమే లక్ష్యంగా ఈ అకాడమీని ఏర్పాటు చేశారు. దీనికోసం అంటారియో క్రికెట్ అకాడమీతో ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. 2026 జనవరిలో ట్రయల్స్ నిర్వహించి, ప్రతిభావంతులైన ఆటగాళ్లను ఎంపిక చేసి పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వనున్నారు.ఈ విస్తరణపై ఢిల్లీ క్యాపిటల్స్ సీఈవో సునీల్ గుప్తా మాట్లాడుతూ.. “కెనడాలో అకాడమీని ప్రారంభించడం అనేది ప్రపంచవ్యాప్త అభివృద్ధికి వేసిన ముఖ్యమైన అడుగు.

Delhi Capitals launches first cricket academy in Canada

ఇక్కడి క్రీడాకారులకు కూడా భారత్‌లోని ఉన్నత ప్రమాణాలతో కూడిన కోచింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నాం” అని తెలిపారు. అంటారియో క్రికెట్ అకాడమీ డైరెక్టర్ డెరెక్ పెరీరా మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం కెనడియన్ క్రికెట్ భవిష్యత్తును మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.జీఎంఆర్, జేఎస్‌డబ్ల్యూ గ్రూపుల ఉమ్మడి యాజమాన్యంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ 2008లో ‘ఢిల్లీ డేర్‌డెవిల్స్’గా ప్రయాణాన్ని ప్రారంభించి 2019లో కొత్త రూపాన్ని సంతరించుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ ఎప్పుడు ప్రారంభమైంది?

ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభమైన సమయంలోనే ఏర్పడింది. తొలుత ఇది ఢిల్లీ డేర్‌డెవిల్స్ అనే పేరుతో లీగ్‌లోకి అడుగుపెట్టింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Canada Cricket cricket academy Delhi Capitals ipl franchise latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.