📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు

David Warner: బిగ్ బాష్ లీగ్ లో వార్నర్ భారీ శ‌త‌కం

Author Icon By Rajitha
Updated: January 4, 2026 • 4:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి తన బ్యాటింగ్ క్లాస్ ఏంటో ప్రపంచానికి చాటాడు. వయసు పెరిగినా, అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా, తనలోని దూకుడు ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు. బిగ్ బాష్ లీగ్ BBL లో హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సిడ్నీ థండర్ తరఫున బరిలోకి దిగిన వార్నర్ అద్భుతమైన శతకంతో అభిమానులను అలరించాడు. ఈ సెంచరీతో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు. అయితే, అతడి వీరోచిత పోరాటం జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది.

Read also: Mohammed Shami: న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన షమీ..

Warner scores a massive century in the Big Bash League

హోబర్ట్ హరికేన్స్ చేతిలో సిడ్నీ థండర్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.నిన్న‌ జరిగిన ఈ మ్యాచ్‌లో వార్నర్ (David warner) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 65 బంతుల్లోనే 11 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 130 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ బీబీఎల్‌ సీజన్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. ఈ శతకంతో టీ20 క్రికెట్‌లో వార్నర్ సెంచరీల సంఖ్య 9కి చేరింది. ఫలితంగా 9 శ‌త‌కాలు చేసిన విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు.

ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ జాబితాలో క్రిస్ గేల్ (22), బాబర్ అజామ్ (11) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్ జట్టు, ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్ వార్నర్ జట్టును ఆదుకున్నాడు. శామ్ బిల్లింగ్స్, నిక్ మ్యాడిన్సన్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

108 పరుగులు జోడించి విజయానికి బలమైన పునాది వేశారు

దీంతో సిడ్నీ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హోబర్ట్ హరికేన్స్ జట్టుకు ఓపెనర్లు టిమ్ వార్డ్, మిచ్ ఓవెన్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు 108 పరుగులు జోడించి విజయానికి బలమైన పునాది వేశారు. ఆ తర్వాత నిఖిల్ చౌదరి, మాథ్యూ వేడ్ రాణించడంతో హోబర్ట్ జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి విజయం అందుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BBL Big Bash League David Warner latest news Sydney Thunder Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.