Dasun Shanaka-IPL 2026: శామ్ కరన్ అవుట్.. రాజస్థాన్ రాయల్స్‌లోకి శనక ఎంట్రీ!

Read Time:  1 min
dasun-shanaka-replaces-sam-curran-rajasthan-royals-ipl-2026-updates
dasun-shanaka-replaces-sam-curran-rajasthan-royals-ipl-2026-updates
FONT SIZE
GET APP

Dasun Shanaka-IPL 2026: ఐపీఎల్ 19వ సీజన్ (IPL 2026) ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైన వేళ, రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టులో కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. గాయపడిన స్టార్ ఆల్‌రౌండర్ శామ్ కరన్ స్థానంలో శ్రీలంక మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ దసున్ శనక (Dasun Shanaka) జట్టులోకి రావడం దాదాపు ఖాయమైంది.మెగా టోర్నీ ప్రారంభానికి కేవలం ఆరు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఫ్రాంచైజీలు తమ జట్లలోని ఖాళీలను భర్తీ చేసే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ ఒక వ్యూహాత్మక అడుగు వేసింది.

Read Also: IPL Orange cap : IPL ఆరెంజ్ క్యాప్ హిస్టరీ.. టాప్ బ్యాటర్లు వీరే

Dasun Shanaka-IPL 2026: పీఎస్‌ఎల్ (PSL) నుంచి వైదొలగిన శనక:

పాకిస్థాన్ సూపర్ లీగ్ వేలంలో అమ్ముడైన ఆటగాళ్లు సైతం ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు పాకిస్థాన్ సూపర్ లీగ్ కాంట్రాక్టును సైతం వదులుకుంటున్నారు.తాజాగా దసున్ శనక కూడా ఐపీఎల్ కోసం పీఎస్‌ఎల్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. గాయపడిన ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ స్థానంలో శనకను తీసుకోవాలని ఫ్రాంచైజీ పావులు కదుపుతోంది. ఇదే విషయంపై ప్రశ్నించగా అవును. మేము శనకతో ఒప్పందం చేసుకోబోతున్నాం. కొన్ని అంశాలు పూర్తి కావాల్సి ఉంది. అతడు శ్రీలంక క్రికెట్‌కు కొన్ని పేపర్లు సమర్పించాల్సి ఉంది అని రాజస్థాన్ రాయల్స్ అధికారి ఒకరు క్రిక్‌బజ్‌తో వెల్లడించాడు.

నిరుడు అబుధాబీలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో దసున్ శనకను కొనేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. కానీ, ఇటీవల ప్రపంచకప్‌లో చెలరేగిన అతడితో పీఎస్‌ఎల్‌ ఫ్రాంచైజీ లాహోర్ క్యాలండర్స్ పాక్ కరెన్సీలో రూ.75 లక్షలకు కొన్నది. అయితే.. శనక ఐపీఎల్ ఆడాలని నిర్ణయించుకున్నందున పీఎస్‌ఎల్‌ కాంట్రాక్ట్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భావిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.