ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, తన క్లాసిక్ బ్యాటింగ్‌తో అలరించిన డెమియన్ మార్టిన్ (Damien Martyn) (54) తీవ్ర అస్వస్థతతో బ్రిస్బేన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆస్ట్రేలియా మీడియా బుధవారం పేర్కొంది. ప్రస్తుతం డెమియన్ మార్టిన్ (Damien Martyn) పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మార్టిన్‌కు మెనింజైటిస్ సోకిందని, ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లిపోయారని, ప్రాణాపాయ స్థితిలో పోరాడుతున్నారని తెలుస్తోంది.
Read Also: Mohammed Shami: వచ్చే న్యూజిలాండ్ సిరీస్‌కు షమీ?
మార్టిన్ త్వరగా కోలుకోవాలని మాజీ సహచర ఆటగాళ్లు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. “మార్టిన్‌కు సాధ్యమైనంత ఉత్తమ వైద్యం అందుతోంది. ప్రజల ప్రార్థనలు, ఆయన కుటుంబానికి ధైర్యాన్నిస్తున్నాయి” అని మార్టిన్ సన్నిహితుడు, మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ తెలిపారు. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో టాడ్ గ్రీన్‌బర్గ్ కూడా మార్టిన్ అనారోగ్యంపై విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఆసీస్ తరఫున మార్టిన్ క్రికెట్ కెరీర్ ఇలా..
ఆస్ట్రేలియా తరఫున 67 టెస్టులు, 208 వన్డేలు ఆడిన మార్టిన్.. మిడిల్ ఆర్డర్లో కీలక బ్యాటర్‌గా సేవలందించాడు. టెస్టుల్లో 46.37 సగటుతో 13 సెంచరీలు సాధించాడు. ముఖ్యంగా 1999, 2003 వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ జట్లలో ఆయన సభ్యుడు. 2003 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాపై విరిగిన వేలితోనే బ్యాటింగ్ చేసి అజేయంగా 88 పరుగులు సాధించిన ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. 2006లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మార్టిన్, ఆ తర్వాత కామెంటేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: