हिन्दी | Epaper
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

Latest News: Pat Cummins: కమిన్స్, హెడ్‌కు రూ. 58 కోట్ల ఆఫర్

Aanusha
Latest News: Pat Cummins: కమిన్స్, హెడ్‌కు రూ. 58 కోట్ల ఆఫర్

ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచంలో ప్రముఖ ఆటగాళ్లు ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ ఇటీవల పెద్ద ఆర్ధిక ఆఫర్‌ వారిని వరించింది.. ఒక ప్రముఖ ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఫ్రాంచైజీ తమ గ్లోబల్ టీ20 టోర్నీల్లో ఆ ఇద్దరు స్టార్ ఆటగాళ్లను ప్లే చేయించడం కోసం వారిని అత్యంత భారీ విధంగా ఆకర్షించడానికి ముందుకొచ్చింది.

Mohammed Kaif: రోహిత్‌తో పోల్చితే కోహ్లీనే నిలకడగా ఆడుతాడు: మహమ్మద్ కైఫ్

క్రీడా వర్గాల సమాచారం ప్రకారం, ప్రతి ఏడాదికి రూ. 58.2 కోట్ల వరకు వచ్చే ఆఫర్ ఇచ్చినట్లు తెలిపింది. ఈ మొత్తం మొత్తానికి సంబంధించిన వేతనం, ప్రోత్సాహకాలు, ఇతర బోనసులు కూడా ఈ డీల్‌లో భాగంగా ఉన్నాయని తెలుస్తోంది.

అయితే ఈ ఆఫర్‌ను కమిన్స్, ట్రావిస్ హెడ్ (Cummins, Travis Head) తిరస్కరించినట్లు తెలుస్తోంది.ఆస్ట్రేలియా జట్టు తరఫున ఈ ఇద్దరు ఆటగాళ్లు ఏడాదికి రూ.8.74 కోట్ల చొప్పున వార్షిక వేతనం అందుకుంటున్నారు. ఈ వేతనానికి 7 రెట్లు ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆఫర్ (IPL franchise offer) చేయడం గమనార్హం.

Pat Cummins
Pat Cummins

ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్స్‌లో భాగమైన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగే ఐఎల్‌టీ20, సౌతాఫ్రికా వేదికగా జరిగే SA20, ఇంగ్లండ్ వేదికగా జరిగే ది హండ్రెడ్ లీగ్స్‌లోనూ ఐపీఎల్ ఫ్రాంచైజీలు భాగమయ్యాయి.ఇక ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్..ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ప్యాట్ కమిన్స్ ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా

ప్యాట్ కమిన్స్ ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా.. ట్రావిస్ హెడ్ ఓపెనర్‌గా ఆడుతున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీనే ఈ ఇద్దరి ఆటగాళ్లకు భారీ ఆఫర్ ఇచ్చి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.ప్రస్తుతం ప్యాట్ కమిన్స్ వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నాడు.

ఈ గాయం కారణంగానే అతను భారత్‌తో వన్డే సిరీస్‌ (ODI series) కు ఎంపికవ్వలేదు. గ్లేన్ మ్యాక్స్‌వెల్ (Glenn Maxwell) కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. మిచెల్ మార్ష్.. ఆసీస్ జట్టును నడిపించనున్నాడు. అక్టోబర్ 19 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.భారత్‌తో ఆస్ట్రేలియా వన్డే జట్టు: మిఛెల్ మార్ష్ (కేప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కొన్నోలీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్‌షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870