📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest news: Cricket: కోహ్లీ రిటైర్మెంట్‌పై గవాస్కర్ ఏమన్నారంటే

Author Icon By Saritha
Updated: October 24, 2025 • 3:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విరాట్ కోహ్లీ రెండో వన్డేలో డకౌట్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సోషల్ మీడియాలో రిటైర్మెంట్ ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్(Cricket) స్పందించాడు. రెండు వరుస వన్డేల్లో డకౌట్ అయినప్పటికీ, ఒక గొప్ప ఆటగాడి కెరీర్ ముగిసిందని చెప్పడం తగదు, ఇంకా కోహ్లీకి చాలా క్రికెట్ ఆడే అవకాశం ఉందని గవాస్కర్ స్పష్టంచేశారు.

ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ (Virat Kohli) సున్నా పరుగుల వద్ద ఔటయ్యాడు. తనకు ఇష్టమైన మైదానంలో డకౌట్ కావడంతో కోహ్లీ నిరాశతో పెవిలియన్‌కి చేరాడు. అయితే, ఈ సందర్భంగా స్టేడియం ప్రేక్షకులు లేచి నిలబడి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి అభినందించారు. కోహ్లీ గ్లోవ్స్‌ను తీసి మైదానాన్ని వీడుతూ అభిమానులకు అభివాదం చేయడం, సోషల్ మీడియాలో అతని వీడ్కోలుగా తప్పుగా అర్థం చేసుకోవడం ప్రారంభమయ్యింది.

Read also: మ‌ల‌యాళీ ‘కొత్త లోక‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!

Cricket: కోహ్లీ రిటైర్మెంట్‌పై గవాస్కర్ ఏమన్నారంటే

గవాస్కర్ అభిప్రాయం కోహ్లీ ఇంకా చాలా ఆట మిగిలి ఉంది

సునీల్ గవాస్కర్, వన్డేల్లో 52 సెంచరీలు, 14,000 పైగా పరుగులు, టెస్టుల్లో 32 శతకాలు సాధించిన ఆటగాడిని(Cricket) రెండు డకౌట్లతో నిష్ప్రభం చేయలేం. అడిలైడ్‌లో రికార్డు ఉన్న మైదానంలో డకౌట్ కావడం సహజమే, కానీ ఇది అతని కెరీర్ ముగింపు కాదు అన్నారు. కోహ్లీ మైదానం వీడుతున్నప్పుడు భారత అభిమానులు మాత్రమే కాకుండా, ఆస్ట్రేలియా ప్రేక్షకులు కూడా లేచి నిలబడి అభినందించడం అతని గొప్పతనానికి గుర్తుగా ఉందని పేర్కొన్నారు.

గవాస్కర్ ఇంకా, “కోహ్లీ ఓటమిని సులభంగా అంగీకరించడు. సిడ్నీలో వచ్చే మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడవచ్చు. దక్షిణాఫ్రికా సిరీస్ మరియు 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మతో కలిసి కోహ్లీ కొనసాగుతారని నేను విశ్వసిస్తున్నా” అని అభిప్రాయపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

CricketLegend CricketNews IndianCricket IndiaVsAustralia Latest News in Telugu SportsUpdate SunilGavaskar Telugu News ViratKohli

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.