ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Messi) తో కలిసి ఆడేందుకు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈవెంట్ ‘GOAT Tour to India 2025’ డిసెంబర్ 13న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ టూర్‌లో భాగంగా మెస్సీ (Messi) తో కలిసి స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు.
Read Also: U-19 ODI Asia Cup: నేటి నుంచి U-19 ODI ఆసియా కప్
వోక్సెన్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఆయన ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు
గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఫుట్‌బాల్ బూట్లు ధరించి మైదానంలోకి దిగారు. వోక్సెన్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఆయన ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. జట్టు జెర్సీ ధరించి ఉత్సాహంగా ఆడిన సీఎం, ఈ మ్యాచ్‌పై తన ఆసక్తిని, ఆత్మవిశ్వాసాన్ని చాటారు. ఫుట్‌బాల్ అంటే బాగా ఇష్టపడే సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా MCRHRD ఇన్‌స్టిట్యూట్ గ్రౌండ్‌లో వార్మప్ మ్యాచ్ ఆడారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన సన్నాహాల్లో ఆయన చురుకుగా పాల్గొంటున్నారు.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ స్నేహపూర్వక మ్యాచ్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) బి. శివధర్ రెడ్డి గురువారం స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. దాదాపు 39,000 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ 23 ఎకరాల స్టేడియాన్ని నాలుగు సెక్టార్లుగా విభజించారు. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ అధికారులను ఆదేశించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: