📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Cheteshwar Pujara: ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా నిలిచిన ఈ ఆటగాడికి బీసీసీఐ చోటిస్తుందా

Author Icon By Divya Vani M
Updated: October 23, 2024 • 10:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్ చటేశ్వర్ పుజారా 103 టెస్ట్ మ్యాచ్‌ల అనుభవం ఉన్నప్పటికీ జట్టులో తన స్థానాన్ని చాలా కాలంగా కోల్పోయాడు అతను చివరిసారిగా 2023 జూన్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడాడు ఆ తర్వాత అతడికి జాతీయ జట్టులో అవకాశాలు దక్కలేదు అయినప్పటికీ పుజారా దేశవాళీ మరియు కౌంటీ క్రికెట్‌లో మాత్రం తన ప్రతిభను కొనసాగిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు ఇటీవలి రంజీ ట్రోఫీ పోటీలో డబుల్ సెంచరీ సాధించాడు ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతడి 18వ అర్ధ సెంచరీగా నిలిచింది

ఈ సమయంలో నవంబర్ నెలలో ప్రారంభమవుతున్న భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి పుజారాను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చలు జరుగుతున్నాయి 36 ఏళ్ల పుజారాకు ఆస్ట్రేలియా పర్యటనల్లో గొప్ప అనుభవం ఉంది 2018-19 సిరీస్‌లో అతను 1,258 బంతులు ఆడి 521 పరుగులు సాధించాడు తద్వారా సిరీస్‌లో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు మూడేళ్ల తరువాత జరిగిన సిరీస్‌లో కూడా 928 బంతులు ఆడి 271 పరుగులు సాధించి భారత బ్యాటింగ్ లైనప్‌కు బలమైన వెన్నెముకగా నిలిచాడు ఆసీస్ పేసర్లు ప్యాట్ కమిన్స్ జాస్ హేజిల్‌వుడ్ మిచెల్ స్టార్క్ వంటి గంభీర బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే గుణం పుజారాకుంది. ఆసక్తికరంగా ప్రస్తుతం ఇరు జట్లలో అత్యధిక టెస్ట్ బంతులను ఎదుర్కొన్న ఆటగాడు పుజారానే కావడం విశేషం ఇది పుజారాను తిరిగి జట్టులోకి తీసుకోవడానికి ఒక కారణంగా పేర్కొనవచ్చు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్టర్లు ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని అతడికి అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం భారత జట్టును అక్టోబర్ 28న ప్రకటించే అవకాశం ఉంది పుజారా వంటి అనుభవజ్ఞుడైన ఆటగాడికి ఆ జట్టులో చోటు కల్పిస్తారా లేదా అనేది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

BCCI Border Gavaskar Trophy Cheteshwar Pujara cricket Team India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.