📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Yuzvendra Chahal: మాజీ భార్య ధనశ్రీ ఆరోపణలపై స్పందించిన చాహల్

Author Icon By Anusha
Updated: October 8, 2025 • 3:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా లెగ్‌ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) తన వ్యక్తిగత జీవితం చుట్టూ తిరుగుతున్న వివాదాలపై చివరికి నోరు విప్పాడు. ఇటీవల ఆయన మాజీ భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.

Shilpa Shetty: ఆ డబ్బులు చెల్లించాల్సిందే..శిల్పా శెట్టికి కోర్టు ఆదేశం

ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “పెళ్లయిన రెండు నెలలకే చాహల్ (Yuzvendra Chahal) నన్ను మోసం చేశాడు” అంటూ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. దీనిపై ఇప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న చాహల్, చివరకు తన వైపు నుంచి స్పష్టత ఇచ్చాడు.

ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ చాహల్ అన్నారు — “నా గురించి అనవసరమైన వార్తలు వస్తున్నాయి. నేను ఎవరినీ మోసం చేయలేదు. ఎవరి ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యమూ నాకు లేదు. నేను నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని మాత్రమే అనుకుంటున్నాను” అని తెలిపారు.

నేను గతాన్ని వదిలేశాను

మోసం చేసే అలవాటు నాకు లేదు. ఒకవేళ పెళ్లయిన రెండో నెలలోనే మోసం చేస్తే, ఆ బంధం ఇన్ని సంవత్సరాలు ఎలా కొనసాగుతుంది? నా జీవితంలో ఆ చాప్టర్ క్లోజ్ అయింది. నేను ముందుకు సాగిపోయాను, అందరూ అదే చేస్తే మంచిది” అని అన్నాడు.

ధనశ్రీ వర్మ (Dhanashree Verma) చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని, వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యం తనకు అర్థమవుతుందని కూడా ఆయన చెప్పారు.కొంతమంది ఇంకా గతాన్నే పట్టుకుని వేలాడుతున్నారని ఈ సంద‌ర్భంగా చాహ‌ల్‌ (Yuzvendra Chahal) విమర్శించాడు. “నేను గతాన్ని వదిలేశాను. కానీ కొందరు ఇంకా అక్కడే ఆగిపోయారు.

Yuzvendra Chahal

చాహల్ ఘాటుగా వ్యాఖ్యానించాడు

ఇప్పటికీ నా పేరు మీదే వాళ్ల ఇల్లు గడుస్తోంది. వాళ్లు అలాగే కొనసాగించవచ్చు. దాని గురించి నేను పట్టించుకోను, నాకు ఎలాంటి ప్రభావం లేదు. ఈ విషయంపై మాట్లాడటం ఇదే చివరిసారి అని భావిస్తున్నాను” అని చాహల్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. సోషల్ మీడియాలో వంద విషయాలు ప్రచారంలో ఉంటాయని, కానీ నిజం ఒక్కటే ఉంటుందని,

అది ముఖ్యమైన వాళ్లకు తెలుసని ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతం తన జీవితం, ఆటపైనే పూర్తి దృష్టి సారించినట్లు చాహల్ తెలిపాడు.ప్రస్తుతం “రైజ్ అండ్ ఫాల్” అనే రియాలిటీ షో (“Rise and Fall” reality show) లో పాల్గొంటున్న ధనశ్రీ వర్మ, తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు.

పెళ్లి ఎప్పుడు విఫలమైందని గ్రహించారని

పెళ్లి ఎప్పుడు విఫలమైందని గ్రహించారని నటి కుబ్రా సైత్ అడగ్గా, “మొదటి సంవత్సరంలోనే అర్థమైంది. పెళ్లయిన రెండో నెలలోనే అతడిని పట్టుకున్నాను” అని బదులిచ్చారు. ఇది ఆమె మాజీ భర్త చాహల్ వివాహేతర సంబంధం గురించేనని పరోక్షంగా సూచించింది.

కాగా, యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ 18 నెలలుగా విడిగా ఉంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం బాంద్రా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అనంతరం మార్చి 20న వీరు అధికారికంగా విడిపోయారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Dhanashree Verma latest news Telugu News Yuzvendra Chahal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.