📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

చాహల్- ధనశ్రీల విడాకులు! భరణంగా ఎన్ని కోట్లు చెల్లించనున్నాడంటే?

Author Icon By Vanipushpa
Updated: February 17, 2025 • 5:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీం ఇండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. చాహల్ తన భార్య ధనశ్రీ వర్మ నుంచి విడిపోనున్నాడని, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రూమర్లపై చాహల్ కానీ ధనశ్రీ వర్మ కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఈ పుకార్లు షికార్లు చేస్తుండగానే ధనశ్రీ వర్మ నుంచి విడాకులు తీసుకోవడానికి యుజ్వేంద్ర చాహల్ రూ. 60 కోట్లు భరణం చెల్లించనున్నాడన్న మరో వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి ఇద్దరి మధ్య ఇప్పటికే చర్చలు జరిగాయని, దీని ప్రకారం యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మకు రూ.60 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే చాహల్ ఈ వార్తలను ఇంకా ధృవీకరించలేదు.


ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటన
భర్తతో విడాకుల పుకార్ల మధ్య ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రకటనను పంచుకుంది. ‘గత కొన్ని రోజులు నాకు, నా కుటుంబానికి చాలా కష్టంగా సాగుతున్నాయి. ఆధారం లేని వార్తలు, ఫేక్ పోస్టులతో నా గౌరవాన్ని చెరిపేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పేరు, కీర్తి సంపాదించడానికి నేను చాలా సంవత్సరాలు కష్టపడ్డాను. నా మౌనం నా బలహీనత కాదు. అదే నా బలం. సోషల్ మీడియాలో నెగెటివిటీ స్పీడ్ గా స్ప్రెడ్ అవుతుంది. నేను నిజానికి కట్టుబడాలని ఉండాలనుకుంటున్నాను. విలువలతో ముందుకు సాగాలని అనుకుంటున్నాను. ఎటువంటి ఆధారాలు లేకపోయినా, నిజానికి విలువెక్కువ. “ఓం నమః శివాయ…” అని రాసుకొచ్చింది ధన శ్రీ వర్మ.

Breaking News in Telugu Chahal-Dhanasree Divorce Google News in Telugu Latest News in Telugu many crores will he pay as alimony? Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.