📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Shubman Gill: రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ గైర్హాజరు

Author Icon By Aanusha
Updated: November 20, 2025 • 9:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) గాయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక అప్‌డేట్ ఇచ్చింది. సౌతాఫ్రికాతో కోల్‌కతా వేదికగా జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో బాధపడిన సంగతి తెలిసిందే.

Read Also: Hope Milestone: హోప్ పవర్ సెంచరీలు

తుది జట్టులో సాయి సుదర్శన్‌కు అవకాశం

అతని స్థానంలో యువ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు తుది జట్టులో అవకాశం లభించనుంది. ఈ మేరకు ఎన్డీటీవీ తన కథనంలో వెల్లడించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో గిల్ (Shubman Gill) గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగలేదు. 124 పరుగుల లక్ష్య ఛేదనలో గిల్ లేని లోటు స్పష్టంగా కనిపించగా, భారత్ 30 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Captain Gill absent from the second Test

సిరీస్‌ను నిర్ణయించే రెండో టెస్టు రేప‌టి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎలాగైనా ఆడాలనే పట్టుదలతో గిల్ జట్టుతో పాటు గువాహటి ప్రయాణమయ్యాడు. అయినప్పటికీ, గాయం తీవ్రత దృష్ట్యా అతనికి విశ్రాంతి ఇవ్వడమే సరైందని జట్టు యాజమాన్యం నిర్ణయించింది.తొలి టెస్టు రెండో రోజున గాయపడిన గిల్‌ను కోల్‌కతాలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు.

మ్యాచ్‌కు సిద్ధం కావడానికి 10 రోజులు

అతను వైద్యపరంగా ఫిట్‌గా ఉన్నప్పటికీ, ఐదు రోజుల టెస్టు మ్యాచ్ భారం గాయాన్ని మరింత తీవ్రం చేసే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. వార్తా సంస్థ పీటీఐ ప్రకారం గిల్ పూర్తిగా కోలుకుని, మ్యాచ్‌కు సిద్ధం కావడానికి కనీసం 10 రోజులు పట్టే అవకాశం ఉంది. ఇక, గిల్ స్థానంలో జట్టులోకి వస్తున్న 24 ఏళ్ల సాయి సుదర్శన్, ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఐదు టెస్టులు ఆడిన అతను 30.33 సగటుతో 273 పరుగులు సాధించాడు.

శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేయకపోవడం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ పరాజయం నేపథ్యంలో రెండో టెస్ట్‌ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం నుంచి గౌహతి వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

India South Africa Test series latest news Shubman Gill injury Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.