గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న సీనియర్ నేషనల్ బాక్సింగ్ (Boxing) చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి సత్తా చాటింది. మహిళల 51 కేజీల విభాగంలో బరిలోకి దిగిన నిఖత్, బుధవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ లో లడఖ్‌కు చెందిన కుల్సూమా బానోపై అద్భుతమైన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
Read Also: Vaibhav Suryavanshi : యువ భారత్ ఘన విజయం, వైభవ్ సూర్యవంశీ సిరీస్ హీరో , SAపై 3-0 క్లీన్ స్వీప్
నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్–2026
ఈ పోరులో తొలి రౌండ్‌లోనే నిఖత్ ఆధిపత్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థిని వెనక్కి నెట్టింది.మరోవైపు, ప్రపంచ చాంపియన్ మీనాక్షి హుడా, అమిత్ పంగల్ కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు. మీనాక్షి 5-0తో, అమిత్ 4-1తో తమ ప్రత్యర్థులను ఓడించారు.బాక్సింగ్ (Boxing)ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎలైట్ పురుషులు, మహిళల నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ 2026 జనవరి 4 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు.
భారత బాక్సింగ్ చరిత్రలో తొలిసారిగా పురుషులు, మహిళల పోటీలను ఒకే వేదికపై ఒకేసారి నిర్వహిస్తున్నారు. ఇది భారత బాక్సింగ్‌కు ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది.రాబోయే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికల పరంగా ఈ చాంపియన్‌షిప్ అత్యంత కీలకంగా భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: