సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ (operation sindoor) వంటి ఘట్టాల తరువాత క్రీడల రంగంలోనైనా భారత్‌పై విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ ఆకాంక్షిస్తోంది. కానీ క్రీడాస్థాయిలో కూడా భారత్ పాకిస్తాన్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదు. ముఖ్యంగా క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ వంటి ప్రముఖ క్రీడల్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ మధ్యకాలంలో రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్‌లు కేవలం క్రీడాపరమైన పోటీ కాకుండా జాతీయ గౌరవ ప్రతిష్ఠలుగా మారాయి.
రాశి ఫలాలు – 06 అక్టోబర్ 2025 Horoscope in Telugu – Vaartha Telugu
మొన్నటి ఆసియా కప్‌లో మెన్స్ క్రికెట్ జట్టు మూడు మ్యాచ్‌లలో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. అంతేకాదు మహిళల వన్డే వరల్డ్ కప్‌లో కూడా మన భారత అమ్మాయిలు పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించారు. క్రికెట్‌కే పరిమితం కాకుండా, U-17 మెన్స్ ఫుట్‌బాల్ జట్టు కూడా ఇటీవల పాకిస్తాన్‌ను మట్టికరిపించడం గమనార్హం. క్రీడా రంగంలోనైనా భారత్‌ను మోకరిల్లించాలనే పాకిస్తాన్ ఆశలు వరుస ఓటములతో మసకబారుతున్నాయి. ఒక మ్యాచ్ అయినా గెలవాలనే వారి సంకల్పం ప్రతి సారి ప్రతిబంధకాలకు గురవుతోంది.

భారత్‌తో పోటీ పడాలంటే పాకిస్తాన్ క్రీడా రంగంలో మౌలిక సదుపాయాలు, శిక్షణా ప్రమాణాలు, ఆటగాళ్లకు అవసరమైన ప్రోత్సాహకాలు వంటి అంశాలలో భారీగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిష్టాత్మక పోటీల్లో గెలవాలంటే కేవలం ఉత్సాహం కాదు, క్రమబద్ధమైన ప్రణాళిక, బలమైన జట్టు, నిరంతర శిక్షణ కూడా అవసరం. ఈ మార్పులు జరిగితేనే పాకిస్తాన్ భవిష్యత్‌లో భారత్‌పై ఒక మ్యాచ్ గెలిచే అవకాశాన్ని సృష్టించుకోగలదని నిపుణుల అంచనా. అప్పటివరకు భారత్ ఆధిపత్యం కొనసాగుతుందనడంలో సందేహం లేదు.