📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం

Belling Muzarabani: బెల్లింగ్ ముజారబానీ బౌలింగ్ చూసి తీరాల్సిందే

Author Icon By Sharanya
Updated: May 19, 2025 • 4:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్స్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు ఐపీఎల్‌(IPL )ను వదిలేయనున్నారు. ఈ ఆటగాళ్లు, తమ జట్టుతో ముందుగానే శిక్షణ శిబిరాల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో IPL మిడ్షన్‌లోనే నిష్క్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో కీలక బౌలర్ అయిన లుంగీ ఎంగిడిని కోల్పోవడం వాళ్ళ ఫ్రాంఛైజీకి ఎదురు దెబ్బే అనిపించింది. అయితే ఆ లోటును రీప్లేస్ చేసేందుకు జింబాబ్వేకి చెందిన యువ వేగ బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీని రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఆర్సీబీ ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. మే 26 తరువాత RCB ఆడే మ్యాచ్‌లకు ముజారబానీ అందుబాటులో ఉంటాడని క్లారిటీ ఇచ్చారు.

బ్లెస్సింగ్ ముజారబానీ: ఆర్సీబీకి కొత్త శక్తిగా

జట్టులోకి ఆరు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తున్న ఓ బౌలర్ రాబోతున్నాడు. అసలు ఆ హైట్‌ నుంచి బంతులు విసిరితే బాబోయ్..! ఐపీఎల్ 2025లో స్ట్రాంగ్‌గా ఉన్న ఆర్సీబీ ఈ బౌలర్ రాకతో మరింత బలంగా మారనుంది. ఇంతకి ఎవరు ఆ బౌలర్ అనుకుంటున్నారా? జింబాబ్వేకి చెందిన బెల్లింగ్ ముజారబానీ. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఇంగ్లండ్ – వెస్టిండీస్ సిరీస్‌తో ఫారెన్ ప్లేయర్లు కొంతమంది ప్లే ఆఫ్స్ సమయానికి ఆయా జట్లని విడిచి పెట్టి వెళ్లాల్సి వస్తోంది. దాంతో బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు ఓ చిన్న ఊరట కల్పించింది. ఈ సిరీస్ వరకు ఏ ప్లేయర్‌ని అయినా తాత్కాలిక రీ ప్లేస్‌మెంట్ చేసుకోవచ్చని అవకాశం కల్పించింది. దాంతో ఇప్పటికే చాలా జట్లు రీప్లేస్‌మెంట్‌ను సద్వినియోగం చేసుకోగా తాజాగా ఆర్సీబీ కూడా ఈ జింబాబ్వే బౌలర్‌ను రీప్లేస్ చేసుకుంది.

ప్లేయర్ రీప్లేస్‌మెంట్ పాలసీతో ఊరట

ఇంగ్లండ్ – వెస్టిండీస్ సిరీస్‌తో ఫారెన్ ప్లేయర్లు కొంతమంది ప్లే ఆఫ్స్ సమయానికి ఆయా జట్లని విడిచి పెట్టి వెళ్లాల్సి వస్తోంది. దాంతో బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు ఓ చిన్న ఊరట కల్పించింది. ఈ సిరీస్ వరకు ఏ ప్లేయర్‌ని అయినా తాత్కాలిక రీ ప్లేస్‌మెంట్ చేసుకోవచ్చని అవకాశం కల్పించింది. దాంతో ఇప్పటికే చాలా జట్లు రీప్లేస్‌మెంట్‌ను సద్వినియోగం చేసుకోగా తాజాగా ఆర్సీబీ కూడా ఈ జింబాబ్వే బౌలర్‌ను రీప్లేస్ చేసుకుంది.

అంతర్జాతీయ గుర్తింపు

ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2024లో ముజారబానీ తన బౌలింగ్‌లో జింబాబ్వేకి విజయాలను అందించాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌పై విజయంలో ఈ ఆటగాడి పాత్ర చాలా కీలకం. బంగ్లాదేశ్ ఆటగాడు మెహిదీ హసన్ మిరాజ్‌తో కలిసి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం ఒకసారి నామినేట్ కూడా అయ్యాడు. ఐపీఎల్ 2022 సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ నెట్ బౌలర్‌గా కూడా కొనసాగాడు. బెస్లింగ్ ముజారబానీ ఇప్పటి వరకు 70 టీ20 ఇంటర్నేషన్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 67 వికెట్లు తీసుకున్న ముజారబానీ 3/8 బెస్ట్ సాధించాడు. లైన్ అండ్ లెంగ్త్ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇరకాటం పెట్టడంతో ఈ జింబాబ్వే బౌలర్ దిట్ట. ముఖ్యంగా డెత్ ఓవర్లలో తక్కువ పరుగులు ఇస్తూ టీమ్ విజయాల్లో కీలకంగా మారాడు. ఈ బౌలర్, RCB ఫాన్స్‌కు కొత్త ఆశను కలిగించనున్నాడు.

Read also: Tom Curran : ‘భారత్-పాక్ ఉద్రిక్తతలతో ఏడ్చేసిన విదేశీ క్రికెటర్’ : టామ్ కరన్

#BellingMuzarabani #BowlingMasterclass #CricketHighlights #FastBowler #Muzarabani #RCB #ZimbabweCricket Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.