భారత్, సౌత్ ఆఫ్రికాల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ జరుగుతోంది..రెండో మ్యాచ్ ను ఆడుతున్నారు. దీని తర్వాత నవంబర్ 30 నుంచి వన్డే సీరీస్ ఆడనుంది. ఆ తరువాత టీ 20 సీరీస్ కూడా. దీనికి సంబంధించి బీసీసీఐ (BCCI) ఈరోజు సమావేశం కానుంది. వన్డే, టీ20 సీరీస్ లకు భారత జట్టును ఎంపిక చేయనుంది.
Read Also: Smriti Wedding: స్మృతి మంధాన వివాహం – బాలీవుడ్ స్టైల్లో ప్రీ-వెడ్డింగ్ సంబురం
అయితే ఇందులో అన్నింటి కంటే కెప్టెన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. కెప్టెన్ గిల్ మెడ నొప్పి కారణంగా టెస్ట్ లకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతను ఆసపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ డాక్టర్లు అతనికి రెస్ట్ అవసరం అని చెప్పడంతో రెండో టెస్ట్ కూ దూరమయ్యాడు. దీని తరువాత వన్డేలకు కూడా గిల్ కు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తోంది.
వరుసగా మ్యాచ్ లు ఆడుతున్న అతనికి రెస్ట్ ఇస్తేనే మంచిదన్న భావనలో ఉంది. అతడితో పాటు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా వన్డేలకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఆస్ట్రేలియా టూర్ లో గాయపడ్డ శ్రేయస్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. అందుకే అతడిని ఆడించి రిస్క్ తీసుకోకూడదని సెలెక్టర్లు యోచిస్తున్నారు. వీరద్దరితో పాటు బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
బీసీసీఐ ఇద్దరి పేర్లను పరిశీలిస్తోంది
అయితే ఇప్పుడు వన్డేలకు గిల్ స్థానంలో ఎవరిని నియమిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో బీసీసీఐ ఇద్దరి పేర్లను పరిశీలిస్తోందని చెబుతున్నారు. రిషబ్ పంత్, కే ఎల్ రాహుల్ లలో ఎవరో ఒకరిని కెప్టెన్ గా నియమించాలని అనుకుంటోంది. గిల్ లేకపోవడంతో, పంత్ ప్రస్తుతం గౌహతి టెస్ట్‌లో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.
కానీ వన్డేల విషయానికి వస్తే..33 ఏళ్ల రాహుల్ 12 వన్డేలు,ఒక టీ20లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. వీటిల్లో తొమ్మిది మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. కెప్టెన్‌గా రాహుల్ వన్డేల్లో 33.55 సగటుతో 302 పరుగులు ,82.28 స్ట్రైక్ రేట్‌తో నాలుగు అర్ధ సెంచరీలు ,58 నాటౌట్‌గా అత్యధిక స్కోరు సాధించాడు.
కెప్టెన్ గా రోహిత్ శర్మ
ఇక పంత్ విషయానికి వస్తే.. ఐదు టీ20ల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు. కానీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో జట్టుకు ఇంకా కెప్టెన్‌గా వ్యవహరించలేదు. ఈ కారణంగానే పంత్ కు కెప్టెన్సీ ఇవ్వాలా వద్దా అని బీసీసీఐ (BCCI) ఆలోచిస్తోందని తెలుస్తోంది. ఇక వీరిద్దరూ కాకుండా వన్డే మ్యాచ్ లకు కెప్టెన్ గా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరు కూడా పరిశీలనలో ఉందని చెబుతున్నారు.
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) అండ్ కో దీనిపై ఒక నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. ఒకవేళ రోహిత్ ఒప్పుకోకపోతే.. వికెట్ కీపర్ కే ఎల్ రాహుల్ ను కెప్టెన్ గా ఎంపిక చేసే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: