ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత జట్టు త్వరలో స్వదేశంలో ఆరంభం కానున్న సిరీస్‌కి సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో వెస్టిండీస్‌తో రెండు టెస్టులు జరుగనున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) త్వరలోనే ఆ జట్టును ప్రకటించనుంది. అయితే, ఈసారి జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోవచ్చని cricket విశ్లేషకులు భావిస్తున్నట్టు సమాచారం.
ముఖ్యంగా, ఇంగ్లండ్ పర్యటనలో నిరాశపరిచిన సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (Karun Nair) ను తప్పించి, దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్‌కు అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్టు సమాచారం.దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ ఇంగ్లండ్‌లో దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
కరుణ్ మళ్లీ జాతీయ జట్టులోకి రావడం కష్టమేనని
ఆ సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడి కేవలం 25.63 సగటుతో 205 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటర్లు పండుగ చేసుకున్న ఆ సిరీస్‌లో కనీసం ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం, ఔటైన తీరు సెలక్టర్లను తీవ్రంగా నిరాశపరిచింది.
దీంతో 33 ఏళ్ల కరుణ్ మళ్లీ జాతీయ జట్టు (National team) లోకి రావడం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు, కర్ణాటకకు చెందిన ఎడమచేతి వాటం బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (Devadatt Padikkal) అద్భుతమైన ఫామ్‌తో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.
జట్టులో కొత్త మార్పులు
ఇటీవలే ఆస్ట్రేలియా-ఏ జట్టుపై లక్నోలో జరిగిన మ్యాచ్‌లో 150 పరుగులతో చెలరేగాడు. దులీప్ ట్రోఫీ (Duleep Trophy) నుంచి ఇప్పటివరకు 111.5 సగటుతో 223 పరుగులు సాధించాడు. ఈ నిలకడైన ప్రదర్శనతో భారత మిడిల్ ఆర్డర్‌లో చోటు దక్కించుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.ఈ ఒక్క మార్పు మినహా ఇంగ్లండ్‌తో ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించే అవకాశం ఉంది.
శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ బ్యాటింగ్ బాధ్యతలు మోయనున్నారు. రిషభ్ పంత్ ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో ధ్రువ్ జురెల్ తొలి వికెట్ కీపర్‌గా, నారాయణ్ జగదీశన్ (Narayan Jagadeesan) బ్యాకప్‌గా ఉండనున్నారు.
అక్షర్ పటేల్‌కు తుది జట్టులో చోటు ఖాయం?
భారత పిచ్‌లపై స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లతో పాటు అక్షర్ పటేల్‌కు తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. పేస్ బౌలింగ్ విభాగంలో బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉండనున్నారు.
ఈ రెండు టెస్టుల సిరీస్ అహ్మదాబాద్ (అక్టోబర్ 2-6), న్యూఢిల్లీ (అక్టోబర్ 10-14) వేదికగా జరగనుంది. ఈ సిరీస్‌ను గెలిచి డబ్ల్యూటీసీ సైకిల్‌లో స్వదేశంలో శుభారంభం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: