📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

BCCI: జూన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా సిరీస్

Author Icon By Saritha
Updated: March 2, 2026 • 3:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

BCCI: భారత క్రికెట్ అభిమానులకు బీసీసీఐ సోమవారం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan) పురుషుల జట్టు జూన్ 2026లో భారత్‌లో పర్యటించనుందని వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య ఒక టెస్టు మ్యాచ్ మరియు మూడు వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. జూన్ 6 నుంచి జూన్ 20 వరకు ఈ సిరీస్ కొనసాగుతుందని బీసీసీఐ తెలిపింది.

బీసీసీఐ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, సిరీస్ ఏకైక టెస్టు మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. జూన్ 6 నుంచి 10 వరకు న్యూ చండీగఢ్‌లోని పీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మైదానం టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ మ్యాచ్ ప్రతీరోజు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఇది రెండో టెస్టు మ్యాచ్ కావడం గమనార్హం.

Read Also: IND vs AFG 2026 Schedule: భారత్-అఫ్గాన్ సిరీస్.. టెస్ట్, వన్డేల వేదికలు ఇవే!

BCCI: Team India’s series against Afghanistan in June

టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం వన్డే సిరీస్ మొదలవుతుంది. జూన్ 14న ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో తొలి వన్డే, జూన్ 17న లక్నోలోని ఏకానా స్టేడియంలో రెండో వన్డే జరగనున్నాయి. సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే మ్యాచ్‌కు చెన్నై వేదిక కానుంది. ఈ మ్యాచ్ జూన్ 20న జరుగుతుంది. అన్ని వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతాయి.

ఈ సిరీస్ వివరాలను బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అధికారికంగా ధృవీకరించారు. భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఇది మల్టీ-ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్‌గా జరగనుందని, భారత హోమ్ సీజన్‌లో ఈ పర్యటన చాలా ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. కొత్త వేదిక న్యూ చండీగఢ్‌లో మ్యాచ్ జరగనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

BCCI Cricket Schedule 2026 India Vs Afghanistan Team India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.