📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు

Author Icon By Anusha
Updated: March 14, 2026 • 3:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

BCCI Naman Awards 2026: ఇటీవలి కాలంలో ఐసీసీ టోర్నీల్లో భారత్ సాధించిన అద్భుత విజయాలను పురస్కరించుకుని బీసీసీఐ ఆదివారం ముంబైలో ‘నమన్’ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించనుంది. మార్చి 8న సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన పురుషుల జట్టుతో పాటు, గత రెండేళ్లలో ఐదు వేర్వేరు ఐసీసీ టైటిళ్లను గెలిచిన భారత జట్లను ఈ వేదికపై ఘనంగా సన్మానించనున్నారు. 2025 వన్డే ప్రపంచకప్ గెలిచిన మహిళల జట్టు, ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలు కూడా ఈ గౌరవాన్ని అందుకోనున్నారు.

Read Also: George Russell Wins Chinese GP Sprint 2026: చైనీస్ గ్రాండ్ ప్రిక్స్ స్ప్రింట్ విజేతగా జార్జ్ రస్సెల్

శుభ్‌మన్ గిల్‌కు ‘పాలీ ఉమ్రిగర్’ అవార్డు

టెస్టు, వ‌న్డే కెప్టెన్ గిల్‌కు పాలీ ఉమ్రిగ‌ర్ అవార్డును ఇవ్వ‌నున్నారు. మ‌హిళ‌ల్లో బెస్ట్ ఇంట‌ర్నేష‌న్ క్రికెట‌ర్ అవార్డును స్మృతీ మంధానాకు ఇవ్వ‌నున్నారు. మాజీ క్రికెట‌ర్లు రోజ‌ర్ బిన్నీ, రాహుల్ ద్రావిడ్‌కు .. క‌ల్న‌ల్ సీకే నాయుడు లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును అంద‌జేయ‌నున్నారు. ఇక బీసీసీఐ లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అందుకోనున్నారు. 1983లో వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన భార‌త జ‌ట్టులో రోజ‌ర్ బిన్నీ స‌భ్యుడిగా ఉన్నారు. ఆ టోర్నీలో అత్య‌ధిక వికెట్లు తీసుకున్నారు.

అయితే 2022 నుంచి 2025 వ‌ర‌కు రోజ‌ర్ బిన్నీ కోచ్‌, సెలెక్ట‌ర్‌, బీసీసీఐ అధ్య‌క్షుడిగా చేశారు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 24వేల ర‌న్స్ చేసిన క్రికెట‌ర్‌గా ద్రావిడ్‌కు గుర్తింపు ఉన్న‌ది. 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన స‌మ‌యంలో భార‌త జ‌ట్టు కోచ్‌గా ద్రావిడ్ ఉన్నారు.బెస్ట్ వుమెన్ డొమెస్టిక్ క్రికెట‌ర్ కేట‌గిరీలో జ‌గ‌న్మోహ‌న్ దాల్మీయా అవార్డును ఇరా జాద‌వ్‌కు ఇవ్వ‌నున్నారు. సీనియ‌ర్ డొమెస్టిక్ వ‌న్డే ఫార్మాట్‌లో బెస్ట్ వుమెన్ క్రికెట‌ర్ అవార్డు ష‌ఫాలీ వ‌ర్మ‌ను వ‌రించ‌నున్న‌ది. బెస్ట్ ఆల్‌రౌండ‌ర్‌కు ఇచ్చే లాల్ అమ‌ర్‌నాథ్ అవార్డును ఆయుష్ మాత్రేకు ఇవ్వ‌నున్నారు. రంజీల్లో బెస్ట ఆల్‌రౌండ‌ర్ అవార్డు విద‌ర్భ ప్లేయ‌ర్ హ‌ర్ష్ దూబేకు వెళ్ల‌నున్న‌ది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

BCCI Naman Awards 2026 Mithali Raj Lifetime Achievement Award Shubman Gill Polly Umrigar Award Suryakumar Yadav T20 World Cup 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.