📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

BCCI : ఐపీఎల్ పునఃప్రారంభానికి లైన్ క్లియర్!

Author Icon By Divya Vani M
Updated: May 11, 2025 • 5:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతలు తాజాగా కొంతమేర శాంతించాయి. కాల్పుల విరమణ ఒప్పందం వల్ల పరిస్థితి తాత్కాలికంగా అదుపులోకి వచ్చింది. దీనితో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌ను తిరిగి ప్రారంభించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఆటగాళ్లు, ఫ్రాంచైజీలు ఇప్పుడు ఒక్కసారి మళ్లీ పుల్ స్పీడ్‌లోకి వస్తున్నారు.ఐపీఎల్ తిరిగి ప్రారంభానికి బీసీసీఐ బాగా చురుగ్గా పనిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియర్ అవ్వగానే మే 15 లేదా 16న మ్యాచ్‌లు మళ్లీ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలకు కీలక సూచనలు కూడా ఇచ్చిందట బోర్డు. అభిమానుల్లో దీనితో మళ్లీ ఆసక్తి, ఊహాగానాలు పెరిగిపోతున్నాయి.

BCCI ఐపీఎల్ పునఃప్రారంభానికి లైన్ క్లియర్!

మొదటి టాస్క్ – ఆటగాళ్ల రిపోర్టింగ్

బీసీసీఐ తాజాగా అన్ని జట్లకు ఒక ముఖ్యమైన సూచన చేసింది. మే 13నాటికి సొంత వేదికలపై (హోమ్ గ్రౌండ్స్‌లో) ఆటగాళ్లు రిపోర్ట్ చేయాలని తెలిపింది. పంజాబ్ కింగ్స్ తప్ప, మిగిలిన జట్లు అందుకు సిద్దమవుతున్నాయి. మళ్లీ ప్రారంభానికి ముందు నూతన షెడ్యూల్‌ను సిద్ధం చేస్తామని కూడా బోర్డు తెలిపింది. అంతేకాక, విదేశీ ఆటగాళ్ల ప్రయాణ వివరాలను వెంటనే సమర్పించాలని ఫ్రాంచైజీలను కోరింది.మిగిలిన 12 లీగ్ మ్యాచ్‌లను త్వరగా పూర్తిచేయాలన్నది బీసీసీఐ లక్ష్యం. అందుకే డబుల్ హెడర్ల పద్ధతిలో గేమ్స్ జరిపే ఆలోచనలో ఉంది. ఇది జరిగితే, మే 25నాటికి ఐపీఎల్ 2025 సీజన్‌ను ముగించవచ్చన్న నమ్మకం ఉంది. టోర్నమెంట్ క్లైమాక్స్ అందరికీ గట్టిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

పంజాబ్ కింగ్స్ పరిస్థితి మాత్రం వేరేలా ఉంది

మొహాలీ పంజాబ్ కింగ్స్‌కి హోమ్ గ్రౌండ్ అయినా, అది పాకిస్థాన్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ మ్యాచ్‌లు నిర్వహించడం ప్రమాదకరం అని భావిస్తోంది బీసీసీఐ. అందుకే ఆ జట్టు గేమ్స్‌ని తటస్థ వేదికపై ప్లాన్ చేయాలని చూస్తోంది. అయితే ఆ వేదికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఈ పాజిటివ్ డెవలప్మెంట్స్ అన్నీ అభిమానుల్లో కొత్త ఆశలు నింపుతున్నాయి. లాంగ్ బ్రేక్ తర్వాత మళ్లీ ఐపీఎల్ చూడబోతున్నామన్న ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తోంది. బీసీసీఐ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్లాన్ చేస్తుండటం అభినందనీయం.

Read Also : Sunil Kumar: పాక్ కాల్పుల్లో మరో సైనికుడు మృతి

BCCI Latest News IPL 2025 IPL 2025 Fixtures IPL 2025 schedule IPL Match Updates IPL Restart News IPL Resumption

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.