ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో భారత జట్టు ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. భారత్ వైట్ వాష్ కావడంతో టెస్టు జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తాయి. జట్టులో మితిమీరిన ప్రయోగాలు చేస్తున్నారని క్రికెట్ విశ్లేషకులు విమర్శలు గుప్పించారు. కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో మార్పులు సజావుగా జరగట్లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ, రోహిత్, అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత టెస్టు జట్టు పూర్తిగా లయ తప్పిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Read Also: Rohit Sharma: దేశం కోసం ఆడుతున్నప్పుడు బెస్ట్ ఇవ్వాలనే ఆలోచిస్తాం
టెస్టు జట్టులో సమతూకం కోసం విరాట్ కోహ్లీ (Virat Kohli) ని తిరిగి టెస్టుల్లో ఆడించాలని, ఈమేరకు రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోవాలని కోహ్లీ (Virat Kohli) ని కోరాలని భావిస్తున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే, తాజాగా, దీనిపై, బీసీసీఐ స్పందించింది..
(టెస్టు) నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరనున్నట్లు వచ్చిన వార్తలను బీసీసీఐ కొట్టిపారేసింది. అవన్నీ రూమర్లేనని స్పష్టం చేసింది. కోహ్లీకి తాము ఎలాంటి రిక్వెస్ట్ చేయలేదని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. ఈ విషయంలో బోర్డు కనీసం చర్చించలేదని పేర్కొన్నారు. ‘దీనిపై కోహ్లీతో మాట్లాడలేదు. పుకార్లకు ప్రాధాన్యం ఇవ్వొద్దు’ అని కోరారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: