📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Shubhman Gill: గిల్ గాయంపై బీసీసీఐ క్లారిటీ

Author Icon By Anusha
Updated: November 16, 2025 • 11:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) గాయంపై భారీ ఆందోళన నెలకొనగా, చివరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారిక ప్రకటన విడుదల చేసింది. గిల్‌కు తీవ్రమైన మెడ నొప్పి (Neck Pain) కారణంగా మ్యాచ్ మధ్యలోనే విరామం తీసుకోవాల్సి వచ్చిందని, అనంతరం అతడిని తక్షణమే ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించినట్లు బీసీసీఐ తెలిపింది.

Read Also: IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే

ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్ట్‌కు అతను పూర్తిగా దూరమయ్యాడని పేర్కొంది. సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నొప్పి తీవ్రం కావడంతో శుభ్‌మన్ గిల్‌ను స్ట్రెచర్ సాయంతో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వార్తలు వచ్చాయి.

మెడకు సర్వైకల్ కాలర్‌తో స్ట్రెచర్‌పై తీసుకెళ్లడంతో పాటు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారనే వార్తలు ఆందోళనకు గురి చేశాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ (BCCI) సోషల్ మీడియా వేదికగా గిల్ గాయంపై క్లారిటీ ఇచ్చింది. గిల్ గాయంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

గిల్ ఈ టెస్ట్‌ మ్యాచ్‌లో ఆడే అవకాశం లేదు

ముందస్తు పరీక్షల్లో భాగంగానే ఆసుపత్రికి తరలించామని చెప్పింది.’కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడకు గాయమైంది. ఆ రోజు ఆట ముగిసిన తర్వాత టెస్ట్‌ల కోసం అతన్ని ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం అతను వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు.

గిల్ ఈ టెస్ట్‌ మ్యాచ్‌లో ఆడే అవకాశం లేదు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతని ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుంది.’అని బీసీసీఐ పేర్కొంది. గిల్ గైర్హాజరీలో టీమిండియా 9 మంది బ్యాటర్లతోనే రెండో ఇన్నింగ్స్ ఆడనుంది.వాస్తవానికి మ్యాచ్ తొలి రోజు ఆట రాత్రే శుభ్‌మన్ గిల్‌కు మెడ కండరాలు పట్టేసాయి. కానీ పెయిన్ కిల్లర్స్ సాయంతో అతను బ్యాటింగ్‌కు దిగాడు.

మూడు బంతులు ఆడి ఓ బౌండరీ కూడా కొట్టాడు. ఈ బౌండరీ కొట్టే క్రమంలో అతని మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి తీవ్రమైంది. దాంతో గిల్ మైదానం వీడాడు. మళ్లీ బ్యాటింగ్‌కు రాలేదు. సాయంత్రానికి నొప్పి తీవ్ర కావడంతో కోల్‌కతాలోని వుడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

BCCI update latest news Shubman Gill injury Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.