हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: BCCI: ఐసీసీకి చేరిన ఆసియా కప్ ట్రోఫీ వివాదం

Anusha
Latest News: BCCI: ఐసీసీకి చేరిన ఆసియా కప్ ట్రోఫీ వివాదం

ఆసియా కప్-2025 ట్రోఫీ చుట్టూ నెలకొన్న వివాదం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. టోర్నీ ముగిసి ఆరు వారాలు గడుస్తున్నా, విజేత భారత జట్టుకు ఇంకా ట్రోఫీ అందలేదు.. ముఖ్యంగా,టోర్నీ విజేతకు ట్రోఫీ ఇవ్వకపోవడం పట్ల బీసీసీఐ (BCCI) తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

Read Also: Sheetal Devi: చరిత్ర సృష్టించిన శీతల్.. సాధారణ ఆర్చర్లతో పోటీ

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఈ అంశాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఈ వారం దుబాయ్‌లో జరగనున్న ఐసీసీ బోర్డు సమావేశంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నఖ్వీ (Mohsin Naqvi) ప్రవర్తనపై ఫిర్యాదు చేయనుంది.సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు,

పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి తొమ్మిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే, మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్‌గా కూడా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని, పతకాలను స్వీకరించేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు.

అసలేం జరిగింది

ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో భారత జట్టు వేచి చూస్తుండగానే నఖ్వీ ట్రోఫీని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.ఈ అసాధారణ పరిణామంపై బీసీసీఐ (BCCI) ఇప్పటికే ఏసీసీ (ACC) కి అధికారికంగా లేఖ రాసింది.

BCCI
BCCI

పది రోజుల క్రితం లేఖ పంపినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా తెలిపారు. ఈ నేపథ్యంలో ఐసీసీ సమావేశంలోనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.

ఐసీసీ బోర్డు సమావేశంలో ట్రోఫీ అప్పగింత

శుక్రవారం జరిగే ఐసీసీ బోర్డు సమావేశం (ICC board meeting) లో ట్రోఫీ అప్పగింత అంశాన్ని బీసీసీఐ బలంగా ప్రస్తావించనుంది.ట్రోఫీ వివాదంతో పాటు, మోసిన్ నఖ్వీ ఏకకాలంలో పీసీబీ చైర్మన్‌గా, ఏసీసీ అధ్యక్షుడిగా, పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కొనసాగడంపైనా బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఒకే వ్యక్తి ప్రభుత్వ, క్రీడా పదవుల్లో ఉండటం ఐసీసీ పాలనా నిబంధనలకు విరుద్ధమని బీసీసీఐ వాదించనుంది.

ఈ విషయంలో బీసీసీఐకి ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల పాకిస్థాన్ జరిపిన సైనిక దాడిలో తమ దేశవాళీ క్రికెటర్లు మరణించారని ఆరోపిస్తూ ఆఫ్ఘనిస్థాన్, పాక్‌తో త్రైపాక్షిక సిరీస్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870