📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: BCCI: ఆసీస్ మహిళా జట్టును క్షమాపణలు కోరిన బీసీసీఐ

Author Icon By Anusha
Updated: October 25, 2025 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ కు వచ్చిన ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టుకు ఇండోర్‌లో తీవ్ర అసౌకర్యకరమైన ఘటన ఎదురైంది.మహిళల వన్డే ప్రపంచకప్ 2025 (Women’s ODI World Cup 2025) కోసం భారత్‌లో పర్యటిస్తున్న ఆసీస్ మహిళల టీమ్.. ఇంగ్లండ్‌తో మ్యాచ్ కోసం ఇండోర్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే వేదికగా నేడు(శనివారం) సౌతాఫ్రికాతో ఆసీస్ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.

IND vs AUS: రో-కో విధ్వంసం.. టీమిండియా ఘన విజయం

అయితే ఆసీస్‌కు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లను ఓ ఆకతాయి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. సదరు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తగా, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తీవ్రంగా స్పందించారు..

వివరాల్లోకి వెళితే, ఇండోర్‌లో తమ హోటల్ నుంచి సమీపంలో ఉన్న కేఫ్‌కు నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు ఆస్ట్రేలియా క్రీడాకారిణులను మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తి అసభ్యంగా తాకాడు. ఈ అవమానకరమైన చర్యతో ఆస్ట్రేలియా జట్టు (Australian women’s team) యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

భారత్ ఎంతో మెరుగైన ఆతిథ్యం ఇచ్చే దేశం

దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్ కోసం ఇండోర్‌లో ఉన్న జట్టుకు ఈ ఘటన తర్వాత అదనపు భద్రతను కల్పించారు. మరోవైపు, ఈ ఘటన భారత్‌లో మహిళా క్రీడాకారుల (female athletes) భద్రతపై అంతర్జాతీయంగా మరోసారి ఆందోళనలకు దారితీసింది.ఈ సంఘటనపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) స్పందిస్తూ, “ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన.

భారత్ ఎంతో మెరుగైన ఆతిథ్యం ఇచ్చే దేశం, ఇలాంటిది జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. మన దేశానికి వచ్చిన అతిథులకు ఇలా జరిగి ఉండాల్సింది కాదు. ఈ ఘటనకు మేం చింతిస్తున్నాం” అని అన్నారు. నిందితుడిని త్వరగా పట్టుకున్నందుకు పోలీసులను అభినందించిన ఆయన, చట్టప్రకారం దోషికి కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

BCCI

జరిగిన ఘటన నన్ను తీవ్రంగా బాధించింది

“ప్రపంచకప్‌లో పాల్గొంటున్న అన్ని జట్లకు ఇప్పటికే భద్రత ఉన్నప్పటికీ, దాన్ని మరింత పటిష్టం చేస్తాం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాం” అని ఆయన హామీ ఇచ్చారు.భారత మాజీ క్రికెటర్ రీమా మల్హోత్రా (Reema Malhotra) కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.

మన దేశంలో ‘అతిథి దేవో భవ’ అంటాం. ఆ మాటను పాటించాలి. ఇలాంటి నీచ మనస్తత్వం ఉన్నవారికి గుణపాఠం కావాలి. దోషికి కఠిన శిక్ష విధించాలి. మహిళలను గౌరవించాలని అందరూ తెలుసుకోవాలి. జరిగిన ఘటన నన్ను తీవ్రంగా బాధించింది” అని ఆమె అన్నారు.పోలీసులు ఈ ఘటనపై వేగంగా స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు భద్రతను పెంచామని, మిగిలిన ప్రపంచకప్ మ్యాచ్‌లు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు బీసీసీఐ (BCCI) స్పష్టం చేసింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

australia women cricket BCCI Breaking News latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.