📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Amit Pasi: టీ20లో సెంచరీ బాదిన బరోడా కీపర్ అమిత్ పాసి

Author Icon By Aanusha
Updated: December 8, 2025 • 10:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో తమ చివరి లీగ్ దశ మ్యాచ్‌లో బరోడా వికెట్ కీపర్-బ్యాటర్, అమిత్ పాసి (Amit Pasi) సంచలనం సృష్టించాడు. తాను ఆడిన తొలి టీ20 మ్యాచ్‌లోనే శతకంతో చెలరేగి ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో 26 ఏళ్ల అమిత్ పాసి కేవలం 55 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సుల సహాయంతో 114 పరుగులు సాధించాడు.

Read Also: Virat kohli: బ్రాండ్ అంబాసిడర్‌గా కోహ్లీ?

తొలి టీ20 మ్యాచ్ లోనే సెంచరీ

కేవలం 44 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం. ఈ ఇన్నింగ్స్‌తో, టీ20 అరంగేట్రంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన పాకిస్థాన్ ఆటగాడు బిలాల్ ఆసిఫ్ (114) రికార్డును సమం చేశాడు. పంజాబ్ ఆటగాడు శివమ్ భాంబ్రీ, హైదరాబాద్ ఆటగాడు అక్షత్ రెడ్డి తర్వాత కెరీర్ తొలి టీ20 మ్యాచ్ లోనే సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌గా పాసి (Amit Pasi) నిలిచాడు. వికెట్ కీపర్ జితేష్ శర్మ దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం టీమిండియాకు సెలెక్ట్ కావడంతో,

Baroda keeper Amit Pasi scores century in T20

అతని స్థానంలో బరోడా జట్టులోకి వచ్చిన పాసి ఓపెనర్‌గా బరిలోకి దిగి అద్భుతంగా రాణించాడు. శివాలిక్ శర్మతో మూడో వికెట్‌కు 60 పరుగులు, కెప్టెన్ విష్ణు సోలంకితో కలిసి కేవలం 32 బంతుల్లోనే 75 పరుగుల కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. దీంతో బరోడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోరు చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో సర్వీసెస్ జట్టు 207 పరుగులకే పరిమితమవడంతో బరోడా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

amit pasi amit pasi century baroda wicketkeeper latest news Syed Mushtaq Ali Trophy 2025 t20 debut century Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.