U19 World Cup controversy : అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా చోటు చేసుకున్న ‘నో షేక్ హ్యాండ్’ ఘటనపై Bangladesh Cricket Board స్పందించింది. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరగలేదని, కేవలం అవగాహన లోపం వల్ల జరిగిన అనుకోని పొరపాటు మాత్రమేనని బీసీబీ స్పష్టం చేసింది.
జింబాబ్వేలోని బులవాయో వేదికగా జరిగిన 2026 అండర్-19 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో టాస్ సమయంలో బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్, భారత కెప్టెన్ ఆయుష్ మ్హత్రేతో కరచాలనం చేయకుండా వెనుదిరిగాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర చర్చ మొదలైంది.
Read Also: Telangana: రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ
ఈ ఘటనపై స్పందించిన బీసీబీ, భారత కెప్టెన్‌ను అవమానించే (U19 World Cup controversy) ఉద్దేశం తమ ఆటగాడికి లేదని స్పష్టం చేసింది. క్రికెట్ స్ఫూర్తి, ప్రత్యర్థి పట్ల గౌరవం వంటి విలువలకు బంగ్లాదేశ్ జట్టు కట్టుబడి ఉందని పేర్కొంది. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం గమనించి, ఆటగాళ్లకు సరైన మార్గదర్శకాలు ఇచ్చినట్లు వెల్లడించింది.
భారత్–బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్య ఇటీవలి కాలంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఘటనకు మరింత ప్రాధాన్యం దక్కింది. అయితే ఈ ఘటనను పెద్ద వివాదంగా మార్చవద్దని, ఇది కేవలం అనుకోకుండా జరిగిన తప్పిదమేనని బీసీబీ కోరింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: