📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20 సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు తిరువనంతపురంలో నేడు 3వ T20

Bangladesh Premier League: హోస్టింగ్ ప్యానల్ నుంచి తప్పుకోవడం పై రిధిమా పాఠక్ క్లారిటీ

Author Icon By Aanusha
Updated: January 7, 2026 • 8:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)కు సంబంధించిన ఓ అంశం పెద్ద చర్చకు దారి తీసింది. బీపీఎల్ హోస్టింగ్ ప్యానెల్ నుంచి భారత స్పోర్ట్స్ ప్రెజెంటర్ రిధిమా పాఠక్‌ హోస్టింగ్ ప్యానల్ నుంచి తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. భారత్‌కు చెందిన వ్యక్తి కావడంతోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీసీఐ) ఆమెను తొలిగించిందని వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రచారాన్ని రిధిమా పాఠక్ ఖండించింది. ఇందులో వాస్తవం లేదని, తనను ఎవరూ తప్పించలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తానే తప్పుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది.

Read Also: Uttar Pradesh crime: రీల్స్ చూస్తూ 10 ఏళ్ల బాలుడు మృతి

View this post on Instagram

A post shared by Ridhima Pathak (@ridhimapathak)

క్రికెట్‌పై నాకు ఉన్న గౌరవం చాలా ఎక్కువ

“నన్ను తొలగించలేదు, నేను స్వయంగా తప్పుకున్నాను” అని రిధిమా పాఠక్ అధికారికంగా పేర్కొంది. “గత కొన్ని గంటలుగా నేను బీపీఎల్ నుంచి డ్రాప్ అయ్యానన్న ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, నేను స్వయంగా ఈ లీగ్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకు ఎప్పుడూ నా దేశమే ముందు.

ఏ ఒక్క అసైన్‌మెంట్‌కన్నా క్రికెట్‌పై నాకు ఉన్న గౌరవం చాలా ఎక్కువ” అని సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేశారు.“సంవత్సరాలుగా ఈ ఆటకు నిజాయితీ, గౌరవం, అంకితభావంతో సేవ చేస్తున్నాను. అది ఎప్పటికీ మారదు. నేను ఎప్పుడూ క్రికెట్ విలువలు, నిజం, స్పష్టత కోసం నిలబడతాను. క్రికెట్‌కు నిజం కావాలి అంతే. ఇక ఈ విషయంపై మరిన్ని వ్యాఖ్యలు చేయను” అని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.