బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)–ఆ దేశ క్రికెటర్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరాయి. బీసీబీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ నజ్ముల్ ఇస్లాం తక్షణమే రాజీనామా చేయాలని క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ (Bangladesh) డిమాండ్ చేసింది. ఆయన రాజీనామా చేయకపోతే జనవరి 15 జరిగే బీపీఎల్ మ్యాచ్ నుంచి బంగ్లాదేశ్ ప్రొఫెషనల్ క్రికెటర్లు అన్ని క్రికెట్ కార్యకలాపాలను బహిష్కరిస్తారని స్పష్టం చేసింది. ఇటీవల ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఐపీఎల్ నుంచి తప్పించడం, వరల్డ్ కప్ కోసం భారత్‌కు వెళ్లడంపై నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ స్పందిస్తూ భావోద్వేగాలకు పోకుండా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాడు.
Read Also: Hyderabad Ranji Captain: మహ్మద్ సిరాజ్‌కు కీలక బాధ్యతలు
క్షమాపణలు కోరుతున్నాం
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీబీ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ నజ్ముల్ ఇస్లాం.. సోషల్ మీడియా వేదికగా తమీమ్ ఇక్బాల్‌ను ‘ఇండియన్ ఏజెంట్’ అని సంబోధించాడు. ఈ వ్యాఖ్యలు ఆటగాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయని క్రికెటర్ల సంక్షేమ సంఘం (CWAB) మండిపడింది. నజ్ముల్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) మ్యాచులతో పాటు అంతర్జాతీయ మ్యాచులను కూడా ఆడబోమని ఆటగాళ్లు స్పష్టం చేశారు.
ఈ పరిస్థితిని గ్రహించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్, మిథున్ ప్రెస్‌మీట్‌కు ముందు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. నజ్ముల్ వ్యాఖ్యలు అనుచితంగా, బాధాకరంగా అనిపించి ఉంటే క్షమాపణలు కోరుతున్నామని బీసీబీ తెలిపింది. అలాగే నజ్ముల్ చేసిన వ్యాఖ్యలు బోర్డ్‌కు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆటగాళ్లను అవమానించే ప్రవర్తనపై తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, ఆటగాళ్లే బంగ్లాదేశ్ క్రికెట్‌కు కీలకం అని పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: