📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ టీమిండియా ఘన విజయం బీసీసీఐతో గూగుల్ ఏఐ ఒప్పందం వరుసగా 6 మ్యాచులు గెలిచిన ఏకైక జట్టు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

T20 World Cup : టీ20 వరల్డ్ కప్‌లో షాక్ ట్విస్ట్, బంగ్లాదేశ్ అవుట్ ఎందుకు?

Author Icon By Sai Kiran
Updated: January 24, 2026 • 9:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

T20 World Cup : కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ జట్టు పాల్గొనడం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధికారికంగా ప్రకటించింది. భారత్‌లో భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని పేర్కొంటూ, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరగా… ఆ విజ్ఞప్తిని ఐసీసీ స్పష్టంగా తిరస్కరించింది.

భారత్–బంగ్లాదేశ్ మధ్య ఉన్న రాజకీయ, దౌత్య పరమైన ఉద్రిక్తతలు ఇప్పుడు క్రికెట్‌పై కూడా ప్రభావం చూపించాయి. వచ్చే నెల 9 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. గ్రూప్ మార్పు లేదా వేదిక మార్పు విషయంలో కూడా ఐసీసీ ఎలాంటి సడలింపులు ఇవ్వలేదు.

Read Also: Prakasam district murder:లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

ఈ అంశంపై జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో (T20 World Cup) పూర్తి సభ్య దేశాల ప్రతినిధులు పాల్గొని ఓటింగ్ నిర్వహించారు. భారత్‌లో భద్రతాపరమైన ముప్పు ఏమీ లేదని, షెడ్యూల్‌లో మార్పులకు అవకాశం లేదని ఐసీసీ తేల్చి చెప్పింది. బంగ్లాదేశ్‌కు 24 గంటల గడువు ఇచ్చినా, ఆ గడువును కూడా వినియోగించుకోకుండా టోర్నీ నుంచి తప్పుకోవాలని బీసీబీ నిర్ణయం తీసుకుంది.

ఐసీసీ నిర్ణయంపై బీసీబీ అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ క్రికెటర్లు ప్రపంచకప్ కోసం ఎంతో శ్రమించారని, కానీ భద్రతాపరమైన ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయని క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టుకు అవకాశం ఇచ్చే వీలుందని ఐసీసీ వర్గాలు సూచిస్తున్నాయి. గ్రూప్ దశలో బంగ్లాదేశ్ ఆడాల్సిన మ్యాచ్‌లను ఇప్పుడు స్కాట్లాండ్ ఆడనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bangladesh Cricket Board Bangladesh out of T20 World Cup BCB ICC issue Breaking News in Telugu Google News in Telugu ICC decision ICC venue change rejected Latest News in Telugu Scotland replacement team security concerns cricket T20 World Cup T20 World Cup India t20 world cup news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.