📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్ తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ఈరోజు నుంచి మలేషియా ఓపెన్ టోర్నమెంట్ అభిమానులను హెచ్చరించిన రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టు ఇదే టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20

AUS vs ENG: యాషెస్ సిరీస్‌.. ఇంగ్లండ్‌దే

Author Icon By Anusha
Updated: December 27, 2025 • 4:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ (AUS vs ENG) ఎట్టకేలకు విజయం సాధించింది. వరుసగా మూడు పరాజయాల తర్వాత నాలుగో టెస్ట్‌లో గెలుపొందింది. మెల్‌బోర్న్ వేదికగా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం నడించిన ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆస్ట్రేలియా (AUS vs ENG) గడ్డపై ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది. 2010-11లో చివరిసారిగా ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ గెలుపొందింది.

Read Also: Delhi Capitals: కెనడాలో తొలి క్రికెట్ అకాడమిని ప్రారంభించిన డీసీ

పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు కూడా ఇలాగే రెండు రోజులు మాత్రమే సాగింది. అందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఓడిపోగా, మెల్‌బోర్న్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఓటమిపాలయ్యింది.. ఆస్ట్రేలియా ఇచ్చిన 175 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. బెన్ డకెట్ – జాక్ క్రాలీ తొలి వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. టీ బ్రేక్ ముందు డకెట్ అవుటవడంతో బ్రైడన్ కార్స్‌ను ఇంగ్లండ్ బ్యాటింగ్‌కి పంపించింది.

AUS vs ENG: Ashes series.. England’s

ఆస్ట్రేలియా జట్టు 152 పరుగులకు ఆలౌట్

కార్స్ కూడా వెంటనే అవుటయ్యాడు. దాంతో ఇంగ్లండ్ ట్రీ బ్రేక్ సమయానికి 65 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. జాక్ క్రాలీ – జాకబ్ బేతెల్ మూడో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. బేతెల్ 40 పరుగులతో రాణించడంతో ఇంగ్లండ్ విజయం సునాయాసం అయింది. హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్ నాటౌట్‌గా నిలిచి విజయాన్ని అందించారు.

కేవలం 32.2 ఓవర్లలోనే 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి యాషెస్‌లో ఇంగ్లండ్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకోగా,తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన ఆస్ట్రేలియా జట్టు 152 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బౌలర్ జోష్ టంగ్ ఐదు వికెట్లతో కంగారులను దెబ్బ కొట్టాడు. ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 110 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 132 పరుగులకు ఆలౌట్ అవ్వగా, ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి మరో నాలుగు వికెట్లు మిగిలుండగానే విజయం సాధించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Australia vs England Test Boxing Day Test England Win latest news Melbourne Test Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.